గతంలో దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు ఏదైనా సినిమా మొదలెట్టినప్పుడు ఆ సినిమా పూర్తయ్యేవరకు గెడ్డం పెంచడం అనేది ఆయన ఒక అలవాటుగా పెట్టుకుని.. కాలక్రమేణా ఆయన ఆ గెడ్డానికే అలవాటు పడిపోయారు కూడా. అయితే అదే రీతిలో ఆయన శిష్యుడు రాజమౌళి కూడా తన దర్శకత్వంలో ఏ సినిమా మొదలెట్టినా ఆ సినిమా కంప్లీట్ అయ్యేవరకు షేవింగ్ చేసుకోకుండా గెడ్డం పెంచడం ఆనవాయితీగా పాటిస్తున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పటివరకు అలానే చేస్తూ వస్తున్నాడు. అయితే రాజమౌళి ఆ గుబురు గెడ్డంలోను అందంగానే ఉంటాడు అది వేరే విషయం.
అయితే ఈ ఇద్దరి దర్శకులను మరొక దర్శకుడు ఫాలో అవుతున్నాడా అనే అనుమానం కలుగుతుంది చూస్తుంటే. ఎప్పుడూ క్లిన్ అండ్ నీట్ షేవ్ తో కనబడే సురేందర్ రెడ్డి ఇప్పుడు సడన్ గా గుబురు గెడ్డంతో కనబడుతున్నాడు. మరి చిరుతో సై రా నరసింహారెడ్డి సినిమా చేద్దామనుకున్నప్పుడు నుండి మొన్నటివరకు నీట్ షేవ్ తో వున్న సురేందర్ రెడ్డి ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యి సినిమా సెట్స్ మీదకెళుతున్న సమయంలో గుబురు గెడ్డం పెంచి దర్శనమిచ్చాడు. నిన్న బుధవారం సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఫొటోస్ లో సురేందర్ రెడ్డి అలా గుబురు గెడ్డంతో కనబడ్డాడు.
మరి సై రా సినిమా మొదలెట్టినప్పటికే గెడ్డం పెరిగిపోయి ఉంటే.. సినిమా పూర్తయ్యేనాటికి సురేందర్ రెడ్డి గెడ్డం పరిస్థితి ఏమిటో అంటూ సెటైర్స్ వేస్తున్నారు కొందరు. మరి ఒక చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించేటప్పుడు ఏమైనా ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నాడో అనేది సురేందర్ రెడ్డి నుండి ఆన్సర్ వచ్చేవరకు ఆయన గెడ్డం మీద ఇంకెన్ని న్యూస్ లు వినబడతాయో..! ఇకపోతే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి నిన్న డిసెంబర్ 6 న సెట్స్ మీదకెళ్లింది.