Advertisementt

'సాహోరా బాహుబలి' ఊపు తగ్గలా..!

Thu 07th Dec 2017 04:42 PM
bahubali,prabhas,sahore baahubali,song,top place  'సాహోరా బాహుబలి' ఊపు తగ్గలా..!
Baahubali Top Place in Trending 'సాహోరా బాహుబలి' ఊపు తగ్గలా..!
Advertisement
Ads by CJ

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానాలు నటించిన 'బాహుబలి' చిత్రం విడుదలై ఇంతకాలం అయినా దాని హవామాత్రం  ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రం రెండు భాగాలు దేశ, విదేశాలలో సృష్టించిన ప్రభంజనం మాటల్లో చెప్పలేం. మరీ ముఖ్యంగా 'బాహుబలి-ది బిగినింగ్‌' సినిమా ముగింపులో వచ్చే కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు? అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరిగినంతగా 100ఏళ్ల భారతీయ సినిమాలో ఇప్పటివరకు ఏచిత్రం కూడా ఇంతటి ఉత్సుకతను, సస్పెన్స్‌ని రేకెత్తించలేకపోయింది. 

ఇక 'బాహుబలి-2' అయితే ఏకంగా 1000కోట్లను మించి కలెక్షన్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఇక ఈచిత్రానికి వచ్చిన ప్రశంసలు, పొగడ్తలు.. ఇలా ఎన్నిచెప్పినా మాటల్లో వర్ణించలేం. రికార్డులతోపాటు పలు అవార్డులు, ఇతర దేశాల ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో కూడా ఈ చిత్రం సంచలనానికి మారుపేరుగా నిలిచింది. ఇప్పటికే 2017లో గూగుల్‌ ప్లేలో 'సాహోరా బాహుబలి' పాట గేమ్‌టాప్‌లో నిలిచింది. ఇక ఇప్పుడు కోట్లాది మంది యూజర్లు ఉన్న ట్విట్టర్‌లో అత్యధికంగా ఉపయోగించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాగ్‌గా 'బాహుబలి' మరో అరుదైన రికార్డును సాధించింది. ఆ తర్వాత స్థానాలలో సల్మాన్‌ఖాన్‌ హోస్ట్‌ చేసిన 'బిగ్‌బాస్‌' సీజన్‌11, ఆ తర్వాత 'మెర్శల్‌'లు నిలిచాయి. ఈ లెక్కన తాజాగా సల్మాన్‌ఖాన్‌ కంటే ప్రభాస్‌ ఎక్కువగా క్రేజ్‌ని పొంది, ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండే రెండు 'బాహుబలి' పార్ట్స్‌తో నేషనల్‌ ఐకాన్‌గా నిలిచాడని అర్ధమవుతోంది. సల్మాన్‌తోపాటు ఈ విషయంలో విజయ్‌కూడా ప్రభాస్‌ వెనుకే నిలిచారు. 

ఇక న్యూస్‌ అండ్‌ పాలిటిక్స్‌లో 'దీపావళి, జీఎస్టీ, మోదీ నిర్వహించే మన్‌కీ బాత్‌లు మూడు స్థానాలలో నిలవగా,  స్పోర్ట్స్‌లో ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌మ్యాచ్‌, ఐపిఎల్‌, ఉమెన్స్‌ వరల్ద్‌ కప్‌లు నిలవడం విశేషం. 

Baahubali Top Place in Trending:

Sahore Baahubali Song Top Place in Google search

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ