కొంత మంది టాప్ హీరోయిన్లు, ఎంతో ఫేమ్, క్రేజ్ ఉన్న నటీమణులు కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యకరంగా తమకు సరి రాని వారిని చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు నాటి హీరోయిన్ రాశి తాను నటించిన 'ఒక పెళ్లాం ముద్దు.. రెండో పెళ్లాం వద్దు' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడమే కాదు.. తన భర్తని దర్శకుడిగా నిలిపేందుకు తానే తాను సంపాదించినదంతా పెట్టి, బినామీగా మారి ఆయన దర్శత్వంలో 'మహారాజశ్రీ, లంక' వంటి మూడు నాలుగు చిత్రాలు తీసింది. కానీ ఆ దర్శకుడు మాత్రం హిట్ కొట్టలేదు. ఇక రాశి కూడా ఆర్దికంగా దెబ్బతింది. ఇక తెలుగులో, తమిళంలో బొద్దుగుమ్మ నమితకి ఉన్న క్రేజ్ ఎంతో అందరికీ తెలిసిందే. తెలుగులో పలు స్టార్స్‌తో నటించిన ఆమె తమిళనాడులో మాత్రం ఓ సంచలనం. ఆమె బొమ్మ పోస్టర్ మీద కనిపించినా, లేక ఆమె ఉందని తెలిస్తే చాలు థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం క్యూకట్టేవారు. ఆమె స్టార్స్‌తోనే కాదు.. చిన్నచిన్న బిగ్రేడ్ హీరోలతో కలిసి నటించినా కూడా జనాలు, కలెక్షన్లు కుమ్మేసేవి.
ఖుష్బూ తర్వాత అంతటి క్రేజ్‌ని, ఏకంగా ఆమె కోసం దేవాలయాలను కట్టించుకుంది ఈ బొద్దు సుందరి, తాజాగా ఈమె ఓ మామూలు స్థాయి చిన్న నటుడు వీర్‌ని వివాహం చేసుకుంది. సినిమాల పరంగా మాత్రం ఆయనకు అసలు గుర్తింపు లేదు. మరి బహుశా వ్యక్తిగతంలో ఆయన ఆర్ధికంగా స్థితిమంతుడే అయి ఉంటాడు. లేకపోతే నమిత పోయి పోయి ఆయన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? అనే గుసగుసలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. తిరుపతిలో వివాహం చేసుకున్న ఈజంటను పలువురు తమిళ, తెలుగు సినీప్రముఖులు హాజరై దీవించారు. ఇక తన వివాహం తదుపరి తన జీవితంలో వచ్చిన మార్పులను గురించి మాట్లాడుతూ, అప్పుడెలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నాను. మహా అయితే మంగళసూత్రం, మెట్టెలు కొత్తగా వచ్చాయి. అయినా నా భర్త గానీ అత్తమామ్మలు గానీ పెళ్లయింది కాబట్టి కుంకుమ పెట్టుకో, చీరకట్టుకో అని ఏ మాత్రం అనడం లేదు. ఇక నేను ఇప్పటికే ముగ్గురి చేతుల్లో మోసపోయాను. దాంతో సరైన భర్తని ఎంచుకోవడం ఎంత కష్టమో తెలిసింది.
ఇక నాకు వీర్ మొదట ప్రపోజల్ పెట్టాడు. ఆయనకు నో చెప్పడానికి నాకేమీ కారణాలు కనిపించకపోవడంతో ఎంతో హ్యాపీగా ఓకే అనేశాను. ఇక ఆయన నాకు ప్రపోజ్ చేయకుండా ఉండి ఉంటే నేనే ఆయనను పెళ్లి చేసుకోమని అడిగే దానిని అని చెప్పుకొచ్చింది. ఇక ఈమెకు పెళ్లి కాకముందు పలువురితో ఎఫైర్స్ ఉన్నాయని వార్తలు వచ్చేవి. కాగా పెళ్లయిన తర్వాత ఆమె రాజకీయాలలోకి రానుందని కోలీవుడ్ మీడియా అంటోంది.