Advertisementt

చిరునే తనకు ఎవర్‌గ్రీన్‌ ఫేవరేట్‌ అంట!

Thu 07th Dec 2017 01:49 PM
gemini suresh,chiranjeevi,interview,inspiration  చిరునే తనకు ఎవర్‌గ్రీన్‌ ఫేవరేట్‌ అంట!
Gemini Suresh About Chiranjeevi చిరునే తనకు ఎవర్‌గ్రీన్‌ ఫేవరేట్‌ అంట!
Advertisement
Ads by CJ

బుల్లితెర వీక్షకులకు ఆయన గొంతు ఎంతోకాలంగా పరిచయం. ఇంత మంచి గొంతు ఉన్న ఈయన ఎలా ఉంటాడా? అని నాడు బుల్లితెరపై ఆయన వాయిస్‌ఓవర్‌ ఇచ్చేటప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ తర్వాత ఆయనే బుల్లితెరపై కనిపిస్తూ యాంకర్‌గా, హోస్ట్‌గా పనిచేశాడు. ఇక ఆయన జెమినిటీవీలో ఎక్కువ పనిచేశాడు. నటునిగా కూడా మారాడు. అతనే సురేష్‌. మామూలుగా ఆయన పేరు సురేష్‌ అంటే ఎవ్వరూ గుర్తుపట్టలేరేమో గానీ జెమిని సురేష్‌ అంటే మాత్రం అందరు ఠక్కున గుర్తు పడతారు. ఆయన తాజాగా మాట్లాడుతూ, నా కెరీర్‌ మొదట జెమిని ఛానెల్‌ ద్వారా మొదలైంది. ఆ తర్వాత పలు రకాలుగా ఎదుగుతూ నన్ను నేను నిరూపించుకున్నాను. నేను మొట్టమొదట చూసిన హీరో మెగాస్టార్‌ చిరంజీవే. నాకు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌ ఫేవరేట్‌ చిరంజీవి గారే. 

ఇక నాకు నటునిగా వెండితెరపై అవకాశం ఇచ్చింది స్వర్గీయ హీరో శ్రీహరి. ఇక నాకు సునీల్‌, రచయిత, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. మేము ఒకే పాఠశాల, కళాశాలల్లో చదివాం. సునీల్‌ నాకు సీనియర్‌. త్రివిక్రమ్‌ అయితే ఇంకా సీనియర్‌. నేను నటించిన ప్రతిచోటా దర్శకుల చేత 'సెహభాష్‌' అనిపించుకున్నాను. ఎవ్వరూ నువ్వు ఇలా తప్పు చేశావని విమర్శించలేదు. ప్రతి దాంట్లో నేను నాదైన స్టైల్‌ని క్రియేట్‌ చేసుకున్నాను. సినిమా ఫీల్డ్‌ అంటేనే మనల్ని మనం నిరూపించుకోవడమే. 

ఇక్కడ మనం ఎంచుకున్న మార్గంలో ఎవరు తోడు వచ్చినా, ఎవరూ తెలియకపోయినా ముందుకు సాగి మనల్ని మనం ప్రూవ్‌ చేసుకోవాలి.. అంటూ పెద్ద పెద్ద మాటలే చెబుతున్నాడు. ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉన్నా కూడా ఇంకా ఎదగని ఆయన ఇప్పుడే మెగాస్టార్‌లెవల్‌లో ఎవరు ఎలాప్రూవ్‌ చేసుకోవాలి? ఎవరు ఎలా నడుచుకోవాలి? అని చెప్పేంత అనుభవం మాత్రం ఆయనకు లేవనే చెప్పాలి. 

Gemini Suresh About Chiranjeevi:

Gemini Suresh Interview Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ