Advertisementt

ముర్ఖుల్లారా.. అంటూ ఖుష్బూ క్లాస్!

Thu 07th Dec 2017 01:26 PM
kushboo,serious,netizen,tamil actress  ముర్ఖుల్లారా.. అంటూ ఖుష్బూ క్లాస్!
Kushboo Class on Netizen ముర్ఖుల్లారా.. అంటూ ఖుష్బూ క్లాస్!
Advertisement
Ads by CJ

సినిమా రంగంలో కుల, మతాలు లేవని అంటారు గానీ వాటికి ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. బాలీవుడ్‌లో ఖాన్‌ త్రయం స్టార్స్‌గా వెలిగిపోతుండవచ్చు. అక్కడ హీరోయిన్లు కూడా తమ పేర్లను ముస్లింలైనా, హిందువులైనా, క్రిస్టియన్లయినా అదే పేరుతో నటిస్తారు. కానీ కొన్నిసార్లు అవి తేడా కొడుతాయి. అందుకే నాటి ఎవర్‌గ్రీన్‌స్టార్‌ దిలీప్‌కుమార్‌ నుంచి దక్షిణాదిలో పలువురు తమ ఒరిజినల్‌ పేర్లను... ఏమతం..ఏ కులం అనేవి తెలియకుండా జాగ్రత్తపడే వారు. ఉదాహరణకు తెలుగులో ఒకనాడు సుప్రసిద్ద నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎడిటర్‌ మోహన్‌, ఆయన తనయుడు జయం రవి, జయం రాజాలు సైతం ముస్లింలే. ఇక నాడు తమిళంలో రెహమన్‌ అనే హీరోగా బాగా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఆయన తెలుగులోకి వచ్చేసరికి రఘు అని స్క్రీన్‌నేమ్‌గా మార్చాడు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

ఎవరో అలీ, సంగీత దర్శకుడు ఎఆర్‌.రెహ్మాన్‌ వంటి వారు తప్పితే అందరూ మరీ ముఖ్యంగా హీరోయిన్లు తమ స్క్రీన్‌నేమ్‌కి అసలు పేరుకి పొంతన లేకుండా పెట్టుకుంటారు. అలా ఓ ముస్లిం యువతిగా వచ్చి తెలుగులో నాటి వెంకటేష్‌కి మొదటి హీరోయిన్‌గా, తర్వాత పలువురితో నటించిన ఖుష్బూ కూడా అంతే. ఆమె అసలు పేరు నఖాత్‌ఖాన్‌. కానీ ఆమె తన పేరును దక్షిణాదిలో ఖుష్బూగా పెట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు తమిళనాట సంచలనం సృష్టించి 'ఖుష్బాంబిక' పేరుతో గుళ్లు కట్టి ఆమెను పూజించే స్థాయికి ఎదిగింది. ఇక ఈమె ఓ ముస్లిం అంటూ ఆమె అసలు పేరును చెబుతూ పలువురు నెటిజన్లు ఆమెని మతం పేరుతో కామెంట్స్‌ చేయడంతో ఆమె ఒక్కసారిగా రివర్స్‌ అయింది. 

ఈమె నటి మాత్రమే కాదు.. ప్రస్తుతం రాజకీయనాయకురాలు కూడా. ఈమె సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తన మతం పేరు చెప్పి నెటిజన్లు సెటైర్లు వేయడంతో ఆమె స్పందిస్తూ 'నిజమే..కొంతమంది కొత్తగా కనుకున్నారు. నాపేరు నఖాత్‌ ఖాన్‌ అని, అది మా అమ్మనాన్న పెట్టిన పేరు. ముర్ఖుల్లారా..అయితే ఏంటి? నేను ముస్లింని అయితే మీకెందుకు? చాలా లేట్‌గా కనుక్కున్నారు. ఇప్పటికే ఆలస్యమైంది. ఇకనైనామేల్కోండి.. మీరు 47 సంవత్సరాల వెనుక ఉన్నారు' అంటూ మండిపడింది. కాగా ఇలా కులమతాలతో ఎవరినైనా నిందించడం తప్పని తెలిసి కూడా చదువుకున్న నెటిజన్లు కూడా అలా కామెంట్‌ చేయడం సమంజసం కాదు. ఇక ఈమె గతంలో అన్నయ్య చిరంజీవితో 'స్టాలిన్‌'లో కీలక పాత్ర చేస్తే ఇప్పుడు తమ్ముడు పవన్‌కల్యాణ్‌తో 'అజ్ఞాతవాసి'లో మరో కీరోల్‌ చేసింది. 

Kushboo Class on Netizen:

Tamil Actress Kushboo Serious on Netizen

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ