ఇప్పుడు బాలీవుడ్ లో వారసుల తెరంగేట్రం జోరందుకుంది. వరుసగా స్టార్ వారసులు బాలీవుడ్లోకి అడుగెట్టేస్తున్నారు. నిన్నటివరకు నటనలో ప్రావీణ్యం, అవార్డ్స్ ఫంక్షన్స్ లో మెరవడం, పార్టీలకు షికార్లకి తిరిగిన బడా స్టార్స్ పిల్లలు ఇప్పుడు ఒక్కసారిగా బాలీవుడ్ తెర మీద సందడి చేసేందుకు రెడీఅయ్యారు. మొన్నటివరకు శ్రీదేవి కూతురు జాన్వీ తెరంగేట్రానికి జరిగిన హడావిడి అంతా ఇంతాకాదు. జాన్వీ కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఎంతగా హైలెట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అలాగే షారుక్ కూతురు, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ లు కూడా బాలీవుడ్ లో తెరంగేట్రం చెయ్యడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పటికే శ్రీదేవి కూతురు జాన్వీ బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ చేతుల మీదుగా ధఢక్ సినిమాతో వెండితెరకు పరిచయమవుతుంది. ఆ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఇకపోతే సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ఈ గ్లామర్ ఇండస్ర్టీలోకి ఎప్పుడో అడుగుపెట్టేసింది. సారా అలీ ఖాన్ ప్రస్తుతం ఎట్ ప్రజెంట్ కేదార్‌నాథ్ ఫిల్మ్‌లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని కొంత పార్ట్ ని ఉత్తరాఖండ్లో షూట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకువచ్చింది.
అదేమిటంటే సారా అలీ ఖాన్ కొత్త చిత్ర నెక్స్ట్ షెడ్యూల్ ని పెద్దఎత్తున ప్లాన్ చేశారు మేకర్స్. కేదార్‌నాథ్ టెంపుల్ తరహాలోనే ఒక భారీ సెట్‌ని ముంబైలోని ఓ ఫిల్మ్ సిటీలో అదిరిపోయే లెవల్లో నిర్మించారు. ఇక ఈ సెట్ గురించి యూనిట్ సభ్యులే రకరకాలు మాట్లాడుకుంటున్నారు. అంటే అంతగా ఆసెట్ అందరిని ఆకట్టుకుంటుందట. అక్కడ కేదార్‌నాథ్ టెంపుల్ ని భారీ వరదలు ముంచెత్తి టెంపుల్ మునిగి సీన్లను చిత్రీకరించనున్నారట.
మరి వరద సీన్స్ అంటే పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకర్లను కావాలి. అందుకే అక్కడికి పెద్ద ఎత్తున వాటర్ క్యాన్స్ తెప్పించారట. గతంలో అంటే నాలుగేళ్ల కిందట ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. మరి సారా నటించే సినిమా మొత్తం ఆ వరదల నేపథ్యంలో సాగే ఓ లవ్‌స్టోరీ గా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో సారా అలీ ఖాన్ సరసన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్నాడు.