అక్కినేని నాగార్జున, రాంగోపాల్‌వర్మ..ఇద్దరు ఇద్దరే.. వీరిద్దరు మనం ఒకటి అనుకుని ఊహిస్తే మరో ట్విస్ట్ ఇస్తారు. కథ, కథనాలు, టైటిల్స్ నుంచి హీరో, వారి యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్, మేనరిజమ్స్ ఇలా అన్ని విభిన్నంగా ఉంటాయి. ఇక వర్మ చిత్రాలలో మాఫియా, గన్స్‌లు, బుల్లెట్స్, కత్తుల వంటివి కామన్. కానీ ముందే వర్మ తాను ఇప్పటి వరకు చేయని జోనర్‌లో, ఎవ్వరూ ఊహించలేని సినిమా చేస్తున్నానని చెప్పాడు. వర్మ అలా అన్ని సినిమాలకు చెబుతాడులే అని లైట్ తీసుకోవడానికి వీలులేదు. ఎంతో కాలంగా కనీసం యావరేజ్ కూడా లేని వర్మ ట్రాక్‌రికార్డ్‌ని కూడా పట్టించుకోకుండా నాగ్ హీరోగా ఒప్పుకోవడం ఆసక్తిని కలిగించే విషయం.
ఇక నాగ్‌కి మంచిజడ్జిమెంట్ ఉంది. ఆయన కూడా ఇప్పటివరకు తాను చేయని పాత్ర, కథలతోఈ చిత్రం ఉంటుందని చెప్పాడు. పెద్దగా సమయం ఇవ్వకుండానే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లారు. ఇక ఈ చిత్రం ప్రీలుక్‌లో పోలీస్ క్యాప్, టీ ఉన్నగ్లాస్, తుపాకీ, లాఠీల వంటివి చూపించి, నాగ్ లుక్‌లో కూడా విపరీతమైన వెరైటీ చూపించాడు వర్మ. ఇక అందరు ఈ చిత్రంలో టబు నటిస్తుందని అన్నారు. కానీ నో ..ఆమె కాదని చెప్పారు. తర్వాత అనుష్క పేరు వార్తల్లోకి వచ్చింది. కానీ దానిని కూడా కాదని ఎవ్వరూ ఊహించని రీతిలో మైరాసరీన్ అనే కొత్త అమ్మాయిని పెట్టుకున్నామని వర్మ బాంబ్‌పేల్చి మీడియా వారి ఊహలకు అందకుండా ముందుకు వెళ్తున్నాడు.
ఇక గతంలో నాగార్జునతో వర్మ తీసిన 'శివ' చిత్రం విడులయ్యే ముందుదాకా ఆ స్టైల్‌లో, ట్రెండ్‌సెట్టర్ అని ఎవ్వరూ భావించలేదు. చివరకు నాడు పోస్టర్లలో కూడా చైన్, చేతిని చూపించారు. ఇక తర్వాత చిత్రం నాగార్జున-శ్రీదేవి చిత్రాన్ని జనాలు ఏదో ఊహించుకున్నారు. కానీ టైటిల్‌తోనే 'గోవిందా..గోవిందా' అనిపించి నిజంగా గోవిందా..గోవిందాని చేశాడు. ఇక 'అంతం' అనే మరో నెగటివ్ టైటిల్‌ని పెట్టి దీనితో వర్మ, నాగ్‌ల పని అంతం.. అంతా 'గోవిందా..గోవిందా'చేసి అనుకున్నంత పని చేశాడు. ఇక ఇప్పుడు ఈ కొత్త చిత్రానికి 'గన్', 'సిస్టమ్' అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ అవి నమ్మశక్యంగా లేవు. మరి ఉన్నట్లుండి నాగ్-వర్మలు కలిసి ఏం సర్‌ప్రైజ్ ఇస్తారో వేచిచూడాల్సివుంది...!