విఐ ఆనంద్ మొదటి చిత్రం సందీప్‌కిషన్ హీరోగా వచ్చిన 'టైగర్'. ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో తన సెకండ్‌మూవీని మనిషి నుంచి దెయ్యం ఆత్మని వెళ్లగొట్టే రొటీన్‌కథతో కాకుండా మనిషి నుంచి దెయ్యం ఆత్మని వెళ్లిపోకుండా చేసే ప్రయత్నం అనే పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దాంతో డీమానిటైజేషన్ సమయంలో నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో', రామ్‌చరణ్ 'ధృవ'లు కూడా అనుకున్న కలెక్షన్లు రాబట్టలేకపోయినా 'ఎక్కిడికి పోతావు చిన్నవాడా' బ్లాక్‌బస్టర్‌గా నిలిచి దర్శకుడు విఐఆనంద్‌కి, హీరో నిఖిల్‌కి అతి పెద్ద సర్‌ప్రైజింగ్ హిట్‌ని ఇచ్చింది. కాగా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కూడా మంచికాన్సెప్ట్ ఉన్న కథలను, సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. దీనికి ఓ ఉదాహరణ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి వెరైటీ చిత్రం కాగా, మనషులను దెయ్యాలు భయపెడతాయి.
మరి మనుషులే దెయ్యాలను భయపెడితే ఎలా ఉంటుంది? అన్న డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'ఆనందోబ్రహ్మ'. ఇక 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ద్వారా మెగా ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ కంట్లో వి.ఐ.ఆనంద్ పడ్డాడు. సొంతగా పెద్ద నిర్మాతలని, రెండు మూడు బేనర్లని కూడా పెట్టుకుని ఇప్పటివరకు సరైనహిట్ కొట్టలేని అల్లుశిరీష్‌తో 'ఒక్కక్షణం' మొదలైంది. ఈ చిత్రం టీజర్ చూస్తుంటే కాస్త డిఫెరెంట్‌గానే ఉంది. శ్రీనివాస్ అవసరాల, అల్లుశిరీష్, సురభి నటించిన ఈ చిత్రం కథ కూడా సినిమా టైటిల్ పోస్టర్‌లో చూపించిన అగ్గిపుల్లల థియరీ మీదే నడించింది.
ఇక నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదకు వస్తే ఫేట్‌తోనైనా, డెస్టినీతోనైనా.. చివరకు చావుతోనైనా పోరాడుతానని చెప్పే హీరో డైలాగ్స్ వింటే ఇందులో కూడా హీరోయిన్‌ని హీరోకాపాడే కాన్సెప్ట్ మీదనే స్టోరీపాయింట్ ఉందని అర్దమవుతోంది. ఈ టీజర్‌కి బ్యాక్‌గ్రౌండ్‌స్కోర్ స్పెషలిస్ట్ అయిన మణిశర్మ అందించిన బీజీఎం ఆకట్టుకుంటోంది. మరి ఈ చిత్రం కనుక హిట్టయితే వి.ఐ.ఆనంద్‌కి అల్లుఅర్జున్‌తో ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇది శిరీష్‌కే కాదు.. ఆనంద్‌కి కూడా కీలకం. మరి ఆనంద్ దీనిని మరో 'టైగర్' చేస్తాడో లేక మరో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చేస్తాడో వేచిచూడాల్సివుంది...!