అఖిల్ - విక్రమ్ కుమార్ - నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హలో సినిమా విడుదలకు కౌన్ డౌన్ స్టార్ట్ అయ్యింది. హలో సినిమా ఈ నెల 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని ఎప్పుడో ప్రకటించారు. ఇక సినిమా షూటింగ్ కూడా పూర్తికావడంతో... ఈ సినిమాకి సంబందించిన పబ్లిసిటీ కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టింది చిత్ర బృందం. ఇప్పటికే హలో టీజర్, ట్రైలర్ విడుదలై ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు హలో పాటల సందడి కూడా మొదలు కాబోతుంది. హలో ఆడియో వేదిక, మరియు ఆడియో డేట్ కూడా బయటికి వచ్చింది.
అఖిల్ హలో కి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. అనూప్ నుండి వచ్చే పాటలు అద్భుతాలు సృష్టించకపోయినా.... మంచి క్రేజే అయితే ఉంది. అనూప్ సంగీతం అందించిన సినిమాలలోని పాటలు మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అయితే కాలేదు. ఇకపోతే హలో పాటల వేడుకను నాగార్జున వైజాగ్ లో జరపాలని అది కూడా ఈ నెల 10 న నిర్వహించాలని డిసైడ్ అయ్యాడట. ఇప్పటికే వైజాగ్ లో ఈ ఆడియో కి సంబందించిన పనులు కూడా మొదలైపోయాయట. ఇక అనూప్ ఆధ్వర్యంలోని హలో సాంగ్స్ కూడా బాగా వచ్చాయంటున్నారు.
అయితే హలో మ్యూజిక్ ఆల్బమ్ లోని ఒక పాటను అఖిల్ స్వయంగా పాడాడంటున్నారు. అదే పాటను అఖిల్ హలో ఆడియో వేదిక మీద వైజాగ్ లో పాడనున్నాడని తెలుస్తుంది. ఇకపోతే హలో సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందనే టాక్ ఉండగా.. ఇప్పుడు హలో శాటిలైట్ హక్కులు కూడా అఖిల్.. అఖిల్ సినిమా శాటిలైట్ హక్కులను చేజిక్కించుకున్న జి ఛానల్ వారే కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది.