Advertisementt

రొమాన్స్ మూడ్ లో అల్లు అర్జున్!

Tue 05th Dec 2017 08:04 PM
allu arjun,anu emmanuel,naa peru surya,shooting,goa  రొమాన్స్ మూడ్ లో అల్లు అర్జున్!
Allu Arjun in Romance Mood రొమాన్స్ మూడ్ లో అల్లు అర్జున్!
Advertisement
Ads by CJ

రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అర్జున్ నా పేరు సూర్య అనే సినిమా చేస్తున్నాడు. సినిమా మొదలెట్టినప్పుడు కొద్దిగా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్  నా పేరు సూర్య షూటింగ్ ని చక చకా కానిచ్చేస్తున్నాడు. ఊటీ లో భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న నా పేరు సూర్య షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం గోవాలో ప్రారంభమైంది. ఇక ఈ షెడ్యూల్ లో హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్, బన్నీ మధ్య గోవా బీచ్ లో ఓ రొమాంటిక్ సీన్ తీస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ గోవాలోనే కొనసాగుతుంది.

ఇకపోతే.. ఈ నెలాఖరు కల్లా నా పేరు సూర్య సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ టాకీ పూర్తిచేయాలని నిర్ణయించారు . ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్, ఊటీలో భారీ షెడ్యూల్స్ నిర్వహించారు. అలాగే గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఉత్తరాదిలో ఓ భారీ షెడ్యూల్ కు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి నా పేరు సూర్య లో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉండబోతుందో అనేది ఇప్పటికే అభిమానుల్లో ఒక ఐడియా వుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఆర్మీ లుక్ లో ఈ మధ్యన బయట మంచి ఫిట్ గా నీట్ హెయిర్ కట్ తో కనబడుతున్నాడు.

సరైనోడు, డీజే సినిమాల సక్సెస్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.  వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. విశాల్ - శేఖర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే కీలకపాత్రల్లో శరత్ కుమార్, అర్జున్ కనిపించనున్నారు.

Allu Arjun in Romance Mood:

Naa Peru Surya Romance Song Shooting in Goa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ