నేడు రమ్యకృష్ణ, జగపతిబాబులకి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు నటిస్తే సినిమాకి అదనపు బలం పెరిగినట్లే. ఇక నాగార్జున నిర్మాతగా ఆయన కథలపై, సినిమాల విషయంలో తీసుకునే జడ్జిమెంట్ పవర్ ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయన సొంతగా ఓ చిత్రం నిర్మిస్తున్నాడంటే దాని రిజల్ట్ ఖచ్చితంగా సక్సెస్ అనే చెప్పాలి. ఏదో కొన్ని సార్లు ఆ గురి తప్పినా ఆయన మాత్రం తన సొంత చిత్రాల విషయంలో ఎంతో పర్‌ఫెక్ట్‌గా నిర్ణయాలు తీసుకుంటాడు. అందునా ఈ మద్య ఆ జాగ్రత్త మరింత ఎక్కువైంది. తనకు నచ్చనిదే టీజర్ కాదు కదా... రిలీజ్‌డేట్ నుంచి ప్రెస్‌మీట్ దాకా ఏదీ ఒప్పుకోనని చెబుతున్నాడు. ఇప్పటికే చెప్పి మరీ 'సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుకచూద్దాం'లను బ్లాక్‌బస్టర్స్‌గా నిలిపాడు. బయటి నిర్మాతల విషయంలో తెలియదు గానీ అన్నపూర్ణ బేనర్ అంటే ఆయనకి బాగా కలిసొస్తుంది.
ఇక ఆయన చిన్నకుమారుడు అఖిల్ తన ఓన్ జడ్జిమెంట్‌తో 'అఖిల్' చేస్తే డిజాస్టర్ అయింది. సో.. 'హలో' చిత్రాన్ని నాగ్ అఖిల్‌కి రీలాంచ్‌గా చెబుతున్నాడు. సో.. ఆయన నమ్మకం అర్ధమవుతోంది. ఇక ఎందరో దర్శకులను కాదని, 'మనం' వంటి క్లాసిక్‌ని తమ బేనర్‌కి, తమ ఫ్యామిలీకి ఇచ్చిన విక్రమ్ కె కుమార్‌నే దర్శకునిగా పెట్టుకున్నాడు. అది కూడా ఆషామాషీగా ఒప్పుకోలేదు. ఆయన చెప్పిన ఎన్నో కథలు విని, వాటిని కాదని మరి 'హలో' సినిమాకి ఓకే చేశాడు. మరోవైపు ఈ చిత్రంతో దర్శకుడు ప్రియదర్శన్, లిజిల కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా, ఆమె తల్లి లిజి రీఎంట్రీ ఇస్తూ నితిన్ హీరోగా త్రివిక్రమ్, పవన్‌లు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తుండటం విశేషం.
మరోపక్క ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు మనం ఎంటర్‌ప్రైజెస్ పేరుని కూడా కలిపి నిర్మిస్తున్నారు. నాగార్జున, అమల, సమంతలు ఇందులో 'హలో' చెప్పనున్నారు. ఇలా అన్ని సెంటిమెంట్లు ఈ చిత్రానికి కలిసి వస్తున్నాయి. మరోవైపు నాగ్‌కి ఎన్నో హిట్స్ ఇచ్చిన క్రిస్మస్ సీజన్‌లోనే ఇది రిలీజ్ కానుంది. మరోపక్క విక్రమ్ కె కుమార్ ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక వస్తువును సెంటిమెంట్‌గా వాడుతాడు. '13'లో టివి, 'మనం'లో క్లాక్‌టవర్. '24'లో వాచ్. ఇక ఇప్పుడు 'హలో'లో మొబైల్ ఫోన్‌ది ఎంతో ప్రత్యేకమట. సో.. ఇవ్వన్నీ కలిసి అఖిల్‌కి పెద్ద హిట్‌నిస్తాయనే చెప్పవచ్చు.