Advertisementt

వావ్.. ఇద్దరు హీరోయిన్స్ తో అర్జున్ రెడ్డి!

Tue 05th Dec 2017 01:26 AM
vijay devarakonda,wow magazine,cover page,arjun reddy,heroines  వావ్.. ఇద్దరు హీరోయిన్స్ తో అర్జున్ రెడ్డి!
Vijay Devarakonda Hot look on WOW Magazine వావ్.. ఇద్దరు హీరోయిన్స్ తో అర్జున్ రెడ్డి!
Advertisement
Ads by CJ

'పెళ్లి చూపులు'కి కూడా రాని పేరు ఒక్క 'అర్జున్ రెడ్డి' తో కొట్టేశాడు విజయ్ దేవరకొండ. ఒక్క రాత్రిలోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఏ యంగ్ హీరోకి రాని, లేని ఫాలోయింగ్ విజయ్ దేవరకొండకి వచ్చేసింది. ఇక 'అర్జున్ రెడ్డి' లో విజయ్ నటనకు యూత్ అంతా ఫిదా అయ్యారు. అప్పటినుండి విజయ్ దేవరకొండ సినిమాలకు పిచ్చ క్రేజ్ వచ్చేసింది. విజయ్ నుండి ఎలాంటి సినిమా వస్తుందా అని యువత అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే 'అర్జున్ రెడ్డి' లో విజయ్ ఎలాంటి కేరెక్టర్ అయితే చేసాడో.. అదే కేరెక్టర్ తో బయట కూడా తన యాటిట్యూడ్ చూపించడం మొదలెట్టాడు.

ఆ సినిమా తర్వాత రిబ్బన్ కటింగ్స్, బ్రాండ్ అంబాసిడర్స్... అలా విజయ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అంతే కాకుండా రకరకాల ఫోటో షూట్స్ తో కుర్రకారుకి మతులు పోగొడుతున్నాడు. వెరైటీ పంచె కట్టుతో బయట అదరగొడుతున్నవిజయ్ దేవరకొండ.. ఇప్పుడు ఒక మ్యాగజైన్ కి అదిరిపోయే ఫోజొకటి ఇచ్చాడు. ఈ ఫోజు చూసిన వారంతా విజయ్ పిచ్చ హాట్ అనక మానరు. ‘వావ్’ అనే మ్యాగజైన్ కోసం విజయ్ చేసిన ఫొటో షూట్ నిజంగానే ‘వావ్’ అనిపించే రీతిలో ఉంది.

ఇంకా ఆ ఫొటోలో.... ఇద్దరమ్మాయిలు పైన కూర్చుంటే.. కింద ఆ అమ్మాయిల వాళ్ల కాళ్లను పట్టుకుని సీరియస్ గా కూర్చున్న విజయ్ లుక్ పిచ్చ హాట్ గా వుంది. అలాగే బ్యాక్ పోజు ఇస్తూ ఆ ఇద్దరమ్మాయిలతో ఉన్న మరో ఫొటో కూడా వెరైటీగా ఉంది. మరి అర్జున్ రెడ్డి విజయ్ డిఫరెంట్ అనడానికి ఈ ఫొటో షూట్ నిదర్శనంగా నిలుస్తోంది. మరి విజయ్ చూపించే ఈ వైరైటీ కే యువత విజయ్ ని అంతలా ఆరాదించేస్తున్నది.

Vijay Devarakonda Hot look on WOW Magazine:

Vijay Devarakonda WOW Magazine Cover Page Sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ