ఇప్పటితరం స్టార్ హీరోయిన్లలో అత్యధికంగా స్టార్ హీరోలను ఆకర్షిస్తూ స్టార్ హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ని పొందుతున్న నటి రకుల్‌ప్రీత్‌సింగ్. ఇప్పటికే ఈమె దాదాపు అందరు యంగ్ స్టార్స్‌ని ఓ రౌండ్ వేసింది. కానీ కొత్తగా మలయాళ బ్యూటీల రాకతో ఈ అమ్మడికి బ్రేక్‌లు పడేలా ఉన్నాయా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. త్వరలో రామ్‌చరణ్‌తో బోయపాటిశ్రీను చిత్రం పట్టాలెక్కనుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక రకుల్‌ప్రీత్‌సింగ్‌తో రామ్‌చరణ్ ఇప్పటికే 'బ్రూస్‌లీ, ధృవ' చిత్రాలలో నటించాడు. మరోపక్క బోయపాటి శ్రీను దర్శకత్వంలో రకుల్ 'సరైనోడు, జయజానకి నాయకా' చిత్రాలలో నటించింది. దాంతో హీరో, దర్శకులిద్దరితో హ్యాట్రిక్ కొట్టేలా రకుల్‌ప్రీత్‌సింగ్‌ని రామ్‌చరణ్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో రూపొందే చిత్రంతోకి తీసుకుంటారని వార్తలు వినిపించాయి. కానీ రామ్‌చరణ్ మాత్రం మరో మలయాళ బ్యూటీపై కన్నేశాడు.
తాజాగా విడుదలైన 'ఆక్సిజన్' చిత్రంతో పాటు పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రంలో కూడా అనూ ఇమ్మాన్యుయేల్ నటించింది. 'అజ్ఞాతవాసి' కోసం స్వయంగా తెలుగులో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఇక అల్లుఅర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకునిగా పరిచయం అవుతూ రూపొందుతున్న 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా'లో కూడా బన్నీకి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. సో..ఇప్పటికే ఇద్దరు మెగాహీరోలతో కలిసి నటిస్తున్న అను ఇమ్మాన్యుయేల్ తాజాగా బోయపాటి శ్రీను, రామ్‌చరణ్ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.