Advertisementt

పవన్‌ గురించి స్నేహా భర్త కూడా..!

Mon 04th Dec 2017 01:37 PM
pawan kalyan,prasanna,heroine sneha wife,praises  పవన్‌ గురించి స్నేహా భర్త కూడా..!
Actor Prasanna Praises Power Star Pawan Kalyan పవన్‌ గురించి స్నేహా భర్త కూడా..!
Advertisement
Ads by CJ

తెలుగులో ప్రస్తుతం ఎవరైనా సరే తమ క్రేజ్‌ కోసం, మెగాభిమానుల ఆదరణ ముఖ్యమని భావిస్తూ పవన్‌ మంత్రం జపిస్తున్నారు. ఇక నిన్నటి హీరోయిన్‌ స్నేహభర్త ప్రసన్న కూడా పవన్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఈయన సాయిధరమ్‌తేజ్‌ నటించిన 'జవాన్‌' చిత్రంలో విలన్‌ పాత్రను పోషించాడు. ఈయన తమిళంలో మంచి బిజీ నటుడు. ఇప్పటికే 25కి పైగా చిత్రాలు చేశాడు. ఆయన మాట్లాడుతూ, 'జవాన్‌' ఆడియో వేడుకలో మెగాభిమానుల సందడి చూసి ఆశ్యర్యపోయాను. ఆయన పేరుఎత్తినా, ఆయన సినిమా పేరు వినపడినా, పవర్‌స్టార్‌ పేరు చెప్పినా అభిమానులు కేరింతలు, వారి గోల చూసి షాక్‌ అయ్యాను. 

టాలీవుడ్‌ ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడి నుంచి వస్తున్న ప్రోత్సాహం మరిచిపోలేను. ఇక్కడి అభిమానులు తమ హీరోలను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. అందుకే నిజంగా టాలీవుడ్‌ హీరోలు ఎంతో అదృష్టవంతులని చెబుతాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక 'జవాన్‌' చిత్రంలో ప్రతినాయకునిగా ఆయన బాగా నటించాడని ప్రశంసలు వస్తున్నాయి. సో.. త్వరలోనే ప్రసన్నకి మరిన్ని తెలుగు చిత్రాలలో అవకాశాలే కాదు.. ఆయన కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా బిజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

Actor Prasanna Praises Power Star Pawan Kalyan:

Heroine Sneha Husband Prasanna Surprised with Pawan Kalyan Craze

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ