ఈ మధ్యన అమలాపాల్ పెళ్లి, విడాకులు వంటి వాటితోనే కాకుండా హాట్ హాట్ ఫొటో షూట్స్, ఇంకా చేతినిండా అవకాశాలతో మీడియాలో హాట్ టాపిక్ అవ్వడమే కాదు.. ఒక కారు కొని దాని రిజిస్టేషన్ పక్క రాష్ట్రంలో చూపించిన దాని మీద కేసులో ఇరుక్కోవడం వంటి విషయాల్తోనూ హైలెట్ అయ్యింది. అసలు ఈ మధ్యన తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబందించిన నటీనటులు ట్యాక్స్ లు ఎగ్గొట్టే విషయంలో తమ వాహనాలను పొరుగు రాష్ట్రం పుదుచ్చేరిలో కొనుక్కుని.. అక్కడే రిజిస్టేషన్ చేయించుకుని మరీ... తాముండే ప్రదేశాలకు తెచ్చుకోవడమనే విషయం కాస్త సీరియస్ యవ్వారంలాగా మారింది.
అందులో ఈ హాట్ హీరోయిన్ కూడా ఉంది. దాదాపు 1.2 కోట్ల విలువైన కారు కొని పుదుచ్చేరిలో రిజిస్టేషన్ చేయించుకుని.. తమిళనాడులో నడపడంతో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ విచారణకు ఆదేశించడంతో రచ్చ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయమై లేట్ గా స్పందించిన అమలాపాల్.. తానేమి మోసం చెయ్యలేదని... తాను పుదుచ్చేరిలో కారు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నపుడు.. పుదుచ్చేరి అడ్రెస్స్ ఇచ్చానని.. అక్కడ తన పేరిట ఒక ఫ్లాట్ కూడా ఉందని చెప్పడమే కాదు..... లోకల్ అడ్రస్ మీదే కారు తీసుకున్నపుడు ఇబ్బందేంటని ఆమె ఎదురు ప్రశ్నించింది.
అయితే తాను ఇలా చేయడం తన తెలివితేటలని..... అంతేకాని తాను చీటర్ ని కాదని.. స్మార్ట్ అని అమలా చాలా తెలివైన సమాధానం చెప్పడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ అమలా తనకు పుదుచ్చేరిలో ఒక ప్లాట్ ఉన్నట్లుగా చెప్పిన చోట కేవలం ఒక గది మాత్రమే ఉందట. అసలు ఆ గది ఊరకే అడ్రస్ కోసం కొనుగోలు చేసింది.... అంతేగాని అది నివాస యోగ్యమైన ఫ్లాట్ కాదట. మరి ఇలా వాహనాల కోసం ఇలాంటి చిన్న గది కొని ఇలాంటి చీటింగ్ పనులు చేసి నేను చీటర్ ని కాదు చాలా స్మార్ట్ అనడం అమలకే చెల్లింది.