సాధారణంగా రాజశేఖర్ బయట ప్రెస్‌మీట్లు, ఇతర కార్యక్రమాలలో మాట్లాడేటప్పుడు అనర్గళంగా మాట్లాడలేడని, ఆయనకు ఇంకా తెలుగు సరిగా రానందువల్ల ఆయన అలా మాట్లాడేవారని చెప్పి కొందరు అనుకునే వారు. దాంతో ఆయన మాటతీరుపై సెటైర్లు కూడా వినిపించేవి. ఇక 'పీఎస్వీ గరుడవేగ' రిలీజ్ సమయంలో తనకు నత్తి ఉందని చెప్పాడు. తాజాగా కూడా ఆయన తన వైకల్యంపై ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, నేను కూడా వికలాంగుడినే. నాకు చిన్ననాడు నత్తి బాగా ఉండేది. దాంతో నా తండ్రి పేరును కూడా నేను సరిగా చెప్పలేకపోయేవాడిని. దాంతో అందరూ నన్ను చూసి ఎగతాళి చేశారు. దాంతో కసితో చదవి డాక్టర్ అయ్యాను. నత్తి ఉండి కూడా సినిమా ఫీల్డ్‌లోకి వచ్చి సక్సెస్ అయ్యాను. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాను.
దివ్యాంగులు బాధపడి, నిరుత్సాహానికి గురి కాకుండా పట్టుదలతో ముందుకు పోవాలి. నా జీవితాంతం నేను దివ్యాంగులకు నాకు చేతనైనా సాయం చేస్తూ ఉంటాను అని చెప్పాడు. ఇక నాటి కత్తికాంతారావు, నేటి యంగ్ హీరో నితిన్‌లకు కూడా బోలెడు నత్తి ఉంది. ఇక రానాకి ఒక కన్ను పనిచేయదు. హీరో ఉపేంద్రకు కనుగుడ్లు తిరగవు. కానీ వీరందరూ పట్టుదలతో తమ వైకల్యాలను అధిగమించి మంచి నటులుగా పేరు తెచ్చుకున్నారు.