నాటి రోజుల్లో అభిమానులు, సామాన్య ప్రేక్షకుల అభిప్రాయాలకు కూడా విలువ ఇచ్చి తమ పేర్ల ముందు బిరుదులను పెట్టుకునే వారు నాటి స్టార్స్. తమకు ఏ తరహా హీరోలుగా గుర్తింపు ఉందో వాటినే బిరుదులుగా పెట్టుకునేవారు. ఇక నాడు 'జ్యోతిచిత్ర'లో సూపర్‌స్టార్ కాంటెస్ట్‌ని పెట్టి ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో వారికి సూపర్‌స్టార్ అని బిరుదులు ఇచ్చేవారు. కానీ నేడు మాత్రం మన హీరోల వారసులు, వారి అభిమానులు వాళ్లకి ఎలాంటి ఇమేజ్ వస్తుంది? ఏ తరహా చిత్రాలు ఆయనకు సూట్ అవుతాయి? అనేవి పరిగణనలోకి తీసుకోకుండానే మొదటి సినిమా విడుదల కాకముందే బిరుదులు తగిలించేసుకుంటున్నారు. ఉదాహరణకు నాగార్జున హీరో అయిన మొదటి చిత్రం 'విక్రమ్'కే ఆయన పేరు ముందు ఆయన తండ్రి నటసామ్రాట్‌ని యువ సామ్రాట్‌గా మార్చివేశారు. ఇక వయసు మీద పడినా ఆయన్ను ఇంకా యువ సామ్రాట్ అనే పిలుస్తుండటంతో ఆయనే నన్ను ఇంకా అలా పిలవవద్దు. కావాలంటే యువసమ్రాట్ అనేది నా కుమారులకు పెట్టండి అంటూనే తనను తాను కింగ్‌గా సంబోధించాలని సూచించాడు. అంటే ఆయన బిరుదును ఆయనే నిర్ణయించుకున్నాడు.
అలాగే బాలయ్య కూడా 'గౌతమీపుత్ర శాతకర్ణి' నుంచి తనను బసవతారక రామపుత్ర అని పిలవాలని హుకుం జారీ చేశాడు. ఇక మెగాస్టార్‌లోని మెగాని, పవర్‌స్టార్‌లోని పవర్‌ని తీసుకుని రామ్‌చరణ్‌కి మొదటి చిత్రానికే మెగా పవర్‌స్టార్ అని పిలిచారు. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇక కృష్ణ విషయానికి వస్తే ఆయనకు మొదట బిరుదు నటశేఖర. తర్వాత సూపర్‌స్టార్ అయ్యాడు. దాంతో మహేష్‌ని మొదటి చిత్రం నుంచే 'ప్రిన్స్' అని పెట్టి... ఆ తర్వాత 'సూపర్‌స్టార్' బిరుదే కృష్ణ నుంచి మహేష్‌కి బదిలీ చేశారు. చిరంజీవి విషయానికి వస్తే ఆయనకు మొదట 'సుప్రీంహీరో' తర్వాత 'మెగాస్టార్'గా బిరుదులు ఇచ్చారు. కానీ ఆయన నటించిన 'బిగ్‌బాస్' సినిమాలో మైటీ మెచో మెగాస్టార్ అనే బిరుదుని ఇచ్చారు. కానీ ఇది ఎవ్వరినీ ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం మహేష్‌బాబు చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ అవుతున్నాయి. దాంతో ఆయన జ్యోతిష్యులను కలిస్తే సూపర్‌స్టార్‌ని పేరు ముందు వాడవద్దని చెప్పారట. దాంతో ఆయన 'భరత్ అనే నేను' చిత్రం ఉంచి ఒమేగా స్టార్‌గా పేరు పెట్టుకుంటున్నాడని తెలుస్తోంది.