Advertisementt

సదా బ్యాక్ ఓకే.. ఫ్రంట్ సంగతేంటి..?

Sun 03rd Dec 2017 03:26 PM
sadha,torch light,back look,torch light first look  సదా బ్యాక్ ఓకే.. ఫ్రంట్ సంగతేంటి..?
Actress Sadha Torch Light Movie Back Look Released సదా బ్యాక్ ఓకే.. ఫ్రంట్ సంగతేంటి..?
Advertisement
Ads by CJ

తేజ దర్శకత్వంలో నితిన్‌ని హీరోగా పరిచయం చేస్తూ గోపీచంద్‌ విలన్‌గా నటించిన 'జయం' చిత్రంలో నితిన్‌ ప్రేమికురాలిగా, 'వెళ్లవయ్యా.. వెళ్లు' అనే డైలాగ్స్‌ తో బాగా పాపులర్‌ అయిన హీరోయిన్‌ సదా. ఆ తర్వాత ఆమె ఎన్టీఆర్‌ నటించిన 'నాగ', అల్లరి నరేష్ 'ప్రాణం'తో పాటు బాలకృష్ణ 'వీరభద్ర', చిరంజీవి 'శంకర్‌ దాదా జిందాబాద్‌'లో కామియో పాత్ర చేసినా హీరోయిన్‌గా అవకాశాలు రాలేదు. దాంతో సిద్దార్ద్‌ చుక్కల్లో చంద్రుడు, ఆర్యన్‌ రాజేష్‌ లీలా మహల్‌ సెంటర్‌. శ్రీకాంత్‌ అ.ఆ..ఇ..ఈ, నితిన్‌ టక్కరి, తేజతో మరోసారి అవునన్నా.. కాదన్నా చిత్రాలలో నటించినా ఆమెకి మరలా హిట్‌ని ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. చివరగా ఆమె తెలుగులో 'యమలీల 2'లో చేసింది. ఇక దాంతో ఆమెకి తెలుగులో ఐరన్‌లెగ్‌ అనే పేరు స్ధిరపడిపోయింది. 

మరోవైపు దర్శకుడు శంకర్‌ బ్యాడ్‌సెంటిమెంట్‌ కూడా ఆమెకి తోడైంది. శంకర్‌ చిత్రాలలో నటించిన హీరోలకు తర్వాత బాగా పేరు వస్తుంది కానీ ఆయన చిత్రాలలో నటించే హీరోయిన్లకు పెద్దగా భవిష్యత్తు ఉండదు అనే ప్రచారం ఉంది. ఏదో ఐశ్వర్యారాయ్‌ వంటి వారు మాత్రమే దీనికి మినహాయింపు. అలా 'అపరిచితుడు'తో పేరు తెచ్చుకున్నా కూడా ఆమెకి అవకాశాలైతే రావడం లేదు. ఇక ఈమె ప్రస్తుతం ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అన్ని చూపించుకుని తన పాస్‌పోర్ట్‌లో ఉండే 'సదాఫ్‌ మహ్మద్‌ సయ్యద్‌'ని స్క్రీన్‌నేమ్‌ చేసుకుంది ఇక ఇటీవల వరకు డ్యాన్స్‌షోలకి జడ్జిగా వ్యవహరిచింది ఈ మహారాష్ట్ర అమ్మడు. మరి పేరు మార్చుకున్న మహత్యమో మరోకటో తెలియదు గానీ ఆమెకి తాజాగా ఓ సినిమా ఆఫర్‌ వచ్చింది. అది కూడా లీడ్‌రోల్‌లో. 

ఈ చిత్రం పేరు 'టార్చిలైట్‌'. రాత్రివేళ్లలో హైవేలపై ఉండే వేశ్యల కథ ఆధారంగా, నిజజీవితంలోని సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఇలాంటి బోల్డ్‌ పాత్రలు ఈమద్య ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అనుష్క, చార్మి, శ్రియ నుంచి బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ వరకు ఇలాంటి పాత్రలు వారికి మంచి పేరును తెచ్చాయి. ఇక ఈ చిత్రంలో ఆమె సెక్సీ బ్యాక్‌ లుక్‌ని చూపిస్తూ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. మరి ఈ చిత్రమైన ఆమెకి పేరును, అవకాశాలను తెచ్చిపెడుతుందా? అనేది చూడాలి. బ్యాక్‌ లుక్‌ వరకు సెక్సీగా బాగానే ఉంది. మరి ఫ్రంట్‌ లుక్‌ అంటే సినిమా ఎలా ఉండబోతుందో..?

Actress Sadha Torch Light Movie Back Look Released:

Actress Sadha Turns Prostitute For Torch Light

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ