Advertisementt

చరణ్ లుక్ చెప్పేస్తుంది రంగస్థలం గురించి!!

Sun 03rd Dec 2017 02:15 PM
ram charan,rangasthalam movie,new look,sukumar  చరణ్ లుక్ చెప్పేస్తుంది రంగస్థలం గురించి!!
Ram Charan New Still From Rangasthalam Movie చరణ్ లుక్ చెప్పేస్తుంది రంగస్థలం గురించి!!
Advertisement
Ads by CJ

సుకుమార్ చెక్కుతున్న రంగస్థలం 1985  చిత్రం షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో అనేది ఎవ్వరికి క్లారిటీ లేదు. రోజుల తరబడి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని పిక్స్ గతంలో చాలానే లీక్ అయ్యాయి. అందులో రామ్ చరణ్ లుంగీ.. భారీ గెడ్డం, బనీనుతో ఊరమాస్ లెక్కన ఉండి మెగా ఫాన్స్ కి పిచ్చెక్కించేశాడు. అంతకు తప్పితే రామ్ చరణ్ రంగస్థలం ఒరిజినల్ లుక్ మాత్రం ఒక్కటి బయటికి రాలేదు. ఎప్పుడు కమర్షియల్ సినిమాలు చేసే రామ్ చరణ్ మొదటిసారి ఇలాంటి కొత్త కేరెక్టర్ లో కనబడుతున్నాడు,

ఇక చరణ్ కూడా రంగస్థలం షూటింగ్ ని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాడట. అంతే కాకుండా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఎన్ని తీసినా కూడా  ప్రయోగాత్మక సినిమాలలో నటిస్తేనే కదా దాని మజా అంటున్నాడట. పూర్తి స్థాయి పల్లెటూరి బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్ని సీన్స్ హైలెట్ అంటుంది చిత్ర బృందం. అయితే ఈ సినిమాలోని ఒక పిక్ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. రంగస్థలం కు సంబందించిన రామ్ చరణ్ లుక్ ఒకటి చేనేత చీరలు నేసె మగ్గాల దగ్గర నిలబడి నవ్వుతున్న ఫోటో మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది.

రామ్ చరణ్ ఉన్న ఆ స్టిల్ ని చూస్తుంటే మాత్రం రంగస్థలం సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ ఒక ముఖ్యపాత్రలో నటిస్తుంది. అలాగే ఆది పినిశెట్టి రామ్, చరణ్ అన్నదమ్ములుగా ఈ సినిమాలో కనిపించనున్నారనే టాక్ ఉండగా.. ఈ సినిమాని మార్చ్ నెలలో విడుదల చేస్తారని అంటున్నారు.

Ram Charan New Still From Rangasthalam Movie:

Superb Response to Ram Charan Rangasthalam Mvoie Photo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ