మలయాళ బ్యూటీ అమలాపాల్ తాను చేసే చిత్రాలతోనే కాదు.. వ్యక్తిగత జీవితంలో కూడా వివాదాలు సృష్టిస్తూ నిత్యం వార్తల్లో ఉంటోంది. కెరీర్ మొదట్లో ఈమె కాస్త నిండైన పాత్రలే చేసి, గ్లామర్ షోని గీత దాటకుండా చూసుకుంది. తమిళ్, మలయాళంతో పాటు తెలుగులో కూడా మెగా యంగ్‌స్టార్స్‌తో నటించింది. ఉన్నట్లుండి దర్శకుడు ఎ.ఎల్. విజయ్‌ని వివాహం చేసుకుంది. ఆ వెంటనే తప్పు చేశానని చెప్పి విడాకులిచ్చేసింది. ఇక తాజాగా ఆమె తన కారుకి కట్టాల్సిన ట్యాక్స్‌ని ఫేక్ అడ్రస్ పెట్టి పాండిచేరిలో కొనడం, దీనిపై పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ కూడా దీనిని సీరియస్‌గా తీసుకుంది. ఇక ఈమె సుచీలీక్స్‌తో ఓ ఊపు ఊపేసింది. ఈ లీక్స్‌లో అందరికంటే ప్రకంపనలు సృష్టించిన భామ ఈమేనని చెప్పాలి. తన తోటి తమిళ హీరోయిన్లయిన నయనతార, త్రిష వంటి వారు కూడా పెళ్లి మాట ఎత్తితే అవకాశాలు పోతాయేమోనని, సహజీవనం, ఎఫైర్స్‌తో పని కానిస్తుంటే పెళ్లయి, విడాకులు తీసుకున్నా కూడా అమలాపాల్ క్రేజ్, అవకాశాలు పెరిగాయే గానీ తగ్గకపోవడం గమనార్హం.
ఇక ఈమెకి ధనుష్‌తో ఎఫైర్ ఉందని ఇప్పటికీ కోలీవుడ్ మీడియా బల్ల గుద్ది చెబుతోంది. ధనుష్ పక్కన వరుస అవకాశాలు దక్కించుకున్న ఈ అమ్మడు ధనుష్ నిర్మాతగా రంజిత్ పా దర్శకత్వంలో రజనీ నటిస్తోన్న 'కాలా'లో కూడా నటిస్తోందని వార్తలు వచ్చాయి. ధనుష్‌కి ఆమెతో ఉన్న ఎఫైర్ కారణంగా తన కూతురి జీవితం నాశనం అవుతుందని భావించిన రజనీ ఈమెను చిత్రంలో పెట్టనివ్వలేదని వార్తలు వచ్చినా, ఇప్పటికీ ఆ చిత్రంలో ఈమె నటిస్తోందనే వార్తలు వస్తున్నాయి.
ఇక తాజాగా ఆమె శృంగారం, నడుము, నాభి అందాలు విపరీతంగా చూపిస్తూ బాబీసింహతో చేసిన 'తిరుట్టి పాయలే 2' విడుదలైంది. ఈ చిత్రం తెలుగు అనువాదం 'దొంగోడొచ్చాడు' పేరుతో త్వరలో విడుదల కానుంది. తాజాగా ఆమె మాట్లాడుతూ, రజనీ, కమల్‌ల పేర్లు చెప్పకుండా తనకు అజిత్‌తో నటించడమే లక్ష్యమని చెప్పింది. ఆయన ఎంతో గొప్పనటుడే కాదు ఎంతో గొప్ప వ్యక్తి. ఆయనతో నటించే చాన్స్ వస్తే మాత్రం వదులుకునేది లేదు. ఆయనతో సినిమా చేయాలని వేయికళ్లతో ఎదురు చూస్తున్నానని చెప్పి, అందరు స్టార్స్‌తో నటించాను. కానీ అజిత్‌తో నటిస్తే మాత్రమే నా కెరీర్‌కి సార్ధకత ఏర్పడుతుందని చెప్పి అజిత్ కళ్లల్లో పడేందుకు వ్యూహం పన్నిందని అర్ధమవుతోంది.