Advertisementt

తమన్‌కి అంత క్రేజ్‌ ఉందా..!

Sun 03rd Dec 2017 02:03 PM
ss thaman,sye raa narasimha reddy,chiranjeevi,ar rahman  తమన్‌కి అంత క్రేజ్‌ ఉందా..!
SS Thaman Clarity on Sye Raa Narasimha Reddy Music తమన్‌కి అంత క్రేజ్‌ ఉందా..!
Advertisement
Ads by CJ

'బాహుబలి' రేంజ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రంగా ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ తమ సొంత బేనర్‌ అయిన కొణిదెల ప్రొడక్షన్స్‌లో తీయనున్న చిత్రం 'సై..రా..నరసింహారెడ్డి'. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ కావడం, తొలి స్వాతంత్య్ర యోధునిగా, బ్రిటిష్‌ వారితో పోరాడిన ధీరునిగా ఆయన చూపించనుండటం. ఉయ్యాలవాడ గురించి ఎవ్వరికి ప్రత్యేకంగా తెలియకపోవడంతో ఈ చిత్రం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక అమితాబ్‌బచ్చన్‌, సుదీప్, విజయ్‌సేతుపతి, నయనతార వంటి వారు పనిచేస్తుండటంతో ఈ చిత్రానికి దేశంలోని అన్ని భాషల్లో క్రేజ్‌ రావడం ఖాయమని భావించారు.

 కానీ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌ అయిన రవివర్మన్‌ దీని నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత తాజాగా రెహ్మాన్‌ తనకున్న బిజీ వల్ల ఈ చిత్రం చేయలేకపోతున్నానని చెప్పాడు. కానీ రెహ్మాన్‌ తాజాగా మలయాళం, తమిళ, హిందీ చిత్రాలను ఒప్పుకుంటున్నాడు. కానీ ఆయన ఈ చిత్రానికి మాత్రం హ్యాండ్‌ ఇచ్చాడు. రవివర్మన్‌ వల్ల పెద్దగా నష్టం లేకపోయినా రెహ్మాన్‌ వైదొలడం మాత్రం ఈ యూనిట్‌కి పెద్ద షాకేనని చెప్పాలి. ఆయన సంగీతం అందిస్తే ఈ చిత్రానికి దేశవిదేశాలలో ఎంతో క్రేజ్‌ వచ్చి ఉండేది. ఇక రాబోయే కాలంలో ఇలాంటి వారు ఎందరు ఈ చిత్రం నుంచి వైదొలుతారేమోననే అనుమానం అందరికీ కలుగుతోంది. 

కాగా 'సైరా..నరసింహారెడ్డి' మోషన్‌ పోస్టర్‌కి తమన్‌ సంగీతం అందించడంతో ఆయనే దీనికి సంగీతం అందిస్తాడని అందరూ భావిస్తున్నారు. తాజాగా తమన్‌ మాట్లాడుతూ 'సై.రా' మేకర్స్‌ నుంచి తనకు పిలుపు రాలేదని, ఒక వేళ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పాడు. సో... తమన్‌ ఇంకా 'సై..రా' మూవీకి ఫైనల్‌ చేయలేదని స్పష్టమైంది...!

SS Thaman Clarity on Sye Raa Narasimha Reddy Music:

No Thaman For Sye Raa Narasimha Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ