Advertisementt

సమంత పెళ్లికి ముందు కోరిక తీరబోతుంది!

Sun 03rd Dec 2017 01:50 PM
samantha,u turn,naga chaitanya,produce,pawan  సమంత పెళ్లికి ముందు కోరిక తీరబోతుంది!
Samantha to bankroll remake of Kannada hit U Turn సమంత పెళ్లికి ముందు కోరిక తీరబోతుంది!
Advertisement
Ads by CJ

హీరోయిన్ సమంత, నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత కెరీర్ లో బాగా బిజీ అయ్యేలాగే కనబడుతుంది. ఇప్పటికే రంగస్థలం 1985  సినిమాతోనూ, మహానటి షూటింగ్ తోనూ, మరోపక్క తమిళ సినిమాలైనా అభిమన్యుడు, శివ కార్తికేయన్ ఇంకా విజయ్ సేతుపతి సినిమాల్లో... సమంత ఫుల్ బిజీగా వుంది. కనీసం పెళ్లయినాక హానీమూన్ కి కూడా వెళ్లకుండా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సమంత త్వరలో తనకిష్టమైన ప్రాజెక్ట్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది అని సమాచారం.

సమంత కి అంత ఇష్టమైన ప్రాజెక్ట్ ఏమిటంటే  2016 లో కన్నడ లో రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన 'యు-టర్న్' రీమేక్ లో సమంతా ఎప్పటినుండో నటించాలని కలలు కంటుంది. ఈ సినిమా అంటే సమంతా కి చాలా ఇష్టం. ఈ సినిమాను రీమేక్ చేయాలని సమంతా ఎన్నాళ్లగానో అనుకుంటుంది. ఫైనల్ గా ఏడాది తరువాత ఇది కార్యరూపం దాల్చనుందని టాక్. ఇప్పటికే సమంత తన భర్త నాగ చైతన్య తో కలిసి కర్ణాటక వెళ్లి పవన్ కుమార్ ని కలిసి ఈ మూవీ తెలుగు రీమేక్ గురించి డిస్కస్ చేసినట్లుగా  తెలుస్తుంది. 

అయితే పవన్ కుమార్ ఈ సినిమాని తెలుగు లో రీమేక్ చేయడానికి అంగీకరించినట్లుగా సమాచారం. త్వరలోనే సమంతా ఈ ప్రాజెక్టును లాంచ్ చేసి..... తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను రీమేక్ చేస్తారనే టాక్ అయితే ఫిలింనగర్ సర్కిల్స్ లో వినబడుతుంది. మరి సమంత అక్కినేని పెళ్లి తర్వాత  స్పీడు మాములుగా లేదంటున్నారు.

Samantha to bankroll remake of Kannada hit U Turn:

Samantha Ruth Prabhu to lead U-turn remakes in Tamil, Telugu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ