Advertisementt

జర్నలిస్ట్ కాదు.. రివీల్ చేసేసింది!

Fri 01st Dec 2017 07:03 PM
mahanati,keerthi suresh,samantha,jamuna,nag ashwin  జర్నలిస్ట్ కాదు.. రివీల్ చేసేసింది!
Samantha Role In Mahanati Movie జర్నలిస్ట్ కాదు.. రివీల్ చేసేసింది!
Advertisement
Ads by CJ

దర్శకుడు నాగ్ అశ్విన్ అలనాటి మేటినటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. సావిత్రి పాత్రలో ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ నటిస్తుంది. ట్రెడిషనల్ పాత్రలకు పెట్టింది పేరైన కీర్తి సురేష్ మహానటి పాత్రలో ఒదిగిపోతుందనే టాక్ ఉంది. అలాగే మహానటి సావిత్రి పాత్ర చెయ్యడం తేలికైన విషయం కాదని కీర్తి కూడా చెప్పింది. ఇకపోతే ఈ పెద్ద ప్రాజెక్ట్ లో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, షాలిని పాండే వంటి నటీనటులు నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో నటించే నటీనటులు మహానటిలో ఏ ఏ పాత్రలు చేస్తున్నారనే విషయం దాదాపుగా రివీల్ అయ్యింది. ఒక్క సమంత పాత్ర తప్ప. అయితే సమంత మహానటి సినిమాలో ఒక జర్నలిస్ట్ పాత్ర చేస్తుందని.. సమంత తన వ్యాఖ్యానంతో సినిమాని కథని నడిపిస్తుందని అన్నారు. కానీ క్లారిటీ మాత్రం లేదు. అయితే సమంత మహానటిలో చెయ్యబోయే పాత్ర గురించి సావిత్రి పాత్రధారి కీర్తి సురేష్ రివీల్ చేసేసింది. కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో సమంత పాత్ర ఏమిటనేది చెప్పేసింది.

సమంత వ్యాఖ్యాతగా సినిమా కథ నడుస్తుందని చెబుతూ.. ఆమె సీనియర్ నటి జమున గారి పాత్రలో మహానటిలో కనిపించబోతున్నట్లు రివీల్ చేసేసింది. మరి నాగ్ అశ్విన్ మహానటికి సంబందించిన వివరాలేమీ బయటికి రాకుండా అతి జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఇలా కీర్తి సురేష్ సమంత పాత్ర గురించిన నిజాలెలా బయటపెట్టేసిందో కదా!.

Samantha Role In Mahanati Movie:

Keerthi Suresh Revealed Samantha Role in Mahanati Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ