తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబుకి ఉన్నంత క్రేజ్ మరే హీరోకి లేదనేది అందరికి తెలిసిన విషయమే. వారి యొక్క గత సినిమాలు అట్టర్ ప్లాప్ అయినా కూడా వారి నుండి సినిమా వస్తుంది అంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలుంటాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాటమరాయుడు భారీ ప్లాప్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి చేస్తున్నాడు. ఈ అజ్ఞాతవాసి సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలున్నాయి. ఎందుకంటే వీరి కలయికలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్ అవడంతో ఇప్పుడు వీరి కలయిక మీద అంతలాంటి అంచనాలున్నాయి. అలాగే మహేష్ బాబు కూడా బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి అపజయాల తర్వాత కొరటాల శివ కలయికలో భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్నాడు.
మరి గతంలో కొరటాల శివ - మహేష్ బాబు కలయికలో వచ్చిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో .. ఇప్పడు వీరి కలయికలో వస్తున్న భరత్ అనే నేను సినిమాపై భారీ అంచనాలొచ్చేశాయి. ఇకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టామినా, మహేష్ స్టామినాకు ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కళ్ళకు కట్టినట్లుగా తెలియజేస్తుంది. ఏపీలో వీరి సినిమాల థియేట్రికల్ రైట్స్ లో మహేష్, పవన్ పోటీ పడ్డారు. అక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసికి ఏకంగా 50 కోట్లకు థియేటర్ రైట్స్ అమ్ముడుపోయాయి. పవన్ కెరీర్ లోనే ఈ ఫిగేర్ బిగ్గెస్ట్ ఫిగర్ కావడం ఇక్కడ విశేషం. అంతేకాకుండా అజ్ఞాతవాసి ఏపీ కి వచ్చిన రేటు అక్కడ నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది.
ఇక మహేష్ భరత్ అనే నేను సినిమా కూడా ఏపీ థియేటర్స్ 45 కోట్లకు అమ్ముడుపోయి ఔరా అనిపించాయి. ఇక 45 కోట్ల ఫిగర్ కూడా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిగర్. మరి ఈ రికార్డు స్థాయి బిజినెస్ ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు చేశాయి అంటే.. వీరి స్టామినా ఏంటో ఈజీగా అర్ధమవుతుంది. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజ్లో కళ్లుచెదిరేలా ఉంటే.... ఇక మిగిలిన శాటిలైట్, డిజిటల్, ఆడియో హక్కుల విషయంలో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాయో అని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.