Advertisementt

త్రివిక్రమ్ చమత్కారం పెంచారంట!

Wed 29th Nov 2017 07:10 PM
keerthi suresh,pspk 25,trivikram srinivas,pawan kalyan  త్రివిక్రమ్ చమత్కారం పెంచారంట!
Keerthi Suresh about Trivikram Srinivas త్రివిక్రమ్ చమత్కారం పెంచారంట!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ బయట చూడడానికి చాలా గంభీరంగా కనబడతాడు. అలాగే మిత భాషి, అంతేకాదు మొహమాటం కూడా చాలా ఎక్కువ అని అంటూ ఉంటారు అంతా. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన సినిమా సెట్స్ లో అలీ వంటి వారి సన్నిహితుల దగ్గర చాలా ఫన్నీగా ఉంటాడనే విషయం చాలా సందర్భాల్లో చాలామందే చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ కూడా పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ లో ఎంత ఫన్నీగా ఉంటాడో చెబుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు పవన్ కళ్యాణ్ తో మొదటిసారి అజ్ఞాతవాసి సినిమాలో జోడి కడుతున్న కీర్తి సురేష్.

అజ్ఞాతవాసిలో వన్ అఫ్ ది హీరోయిన్ అయిన కీర్తి సురేష్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ తెరవెనుక చాలా జోక్స్‌ వేస్తుంటారని..... ఆయన వేసే జోక్స్ కు దర్శకుడు  త్రివిక్రమ్‌, అలాగే మరో హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ తోపాటు యూనిట్‌ మొత్తం నవ్వుకుంటుంటామని చెప్పింది. అజ్ఞాతవాసి చిత్ర బృందం మొత్తం ఒక పెద్ద కుటుంబం మాదిరి ఉంటామని చెబుతుంది కీర్తి. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం చాలా బాగుందని.. ఆయన రాసే డైలాగ్స్ బావుంటాయని.. అయన డైలాగ్స్ అన్ని చమత్కారంతో కూడుకున్నవని చెబుతుంది.

తన పాత్రకి సంబందించిన డైలాగ్స్ కూడా చమత్కారపు డైలాగ్స్ అని చెబుతుంది కీర్తి సురేష్. త్రివిక్రమ్ ఎప్పుడూ ఉత్సాహంగా, పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటారని అటు పవన్ ని, ఇటు త్రివిక్రమ్ ని ఆకాశానికెత్తేసింది ఈ హీరోయిన్.

Keerthi Suresh about Trivikram Srinivas:

Keerthi Suresh Praises Director Trivikram Srinivas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ