Advertisementt

పవన్ నిజాయితీ, మంచితనం ఇష్టం: హీరో!

Wed 29th Nov 2017 06:37 PM
  పవన్ నిజాయితీ, మంచితనం ఇష్టం: హీరో!
Siva Balaji About Power Star Pawan Kalyan పవన్ నిజాయితీ, మంచితనం ఇష్టం: హీరో!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఉన్న స్టార్స్‌లో ఎవరి శైలి వారిది. ఎవరి మనస్తత్వం వారిది. ఇక వీరందరి కంటే పవన్‌ కాస్త డిఫరెంట్‌. అలాంటి పవన్‌కళ్యాన్‌తో బిగ్‌బాస్‌ సీజన్‌ 1 విజేత శివబాలాజీ 'కాటమరాయుడు'లో ఓ సోదరుడిగా చేశాడు. పవన్‌తో పనిచేసిన వారందరూ ఆయన నుంచి ఏదో నేర్చుకున్నామని చెబుతారు? మరి మీరు పవన్‌తో 60రోజులు కలిసి పనిచేశారు కదా...! మరి మీరు ఆయన నుంచి ఏమి నేర్చుకున్నారు? అనే ప్రశ్నకు శివబాలాజీ సమాధానం ఇస్తూ..

పవన్‌ చాలా డిఫరెంట్‌. నేను గతంలోకి పోగలిగితే పవన్‌తో గడిపిన రోజుల్లోకే వెళ్తాను. ఆయన మాట్లాడే ప్రతి మాట మనసులోంచి వస్తుంది. హృదయంలోంచి వచ్చే ఆ మాటలు ఎదుటి వారి హృదయాలను తాకుతాయి. పవన్‌లో నేను నేర్చుకున్నవి రెండు విషయాలు. ఒకటి నిజాయితీ... రెండోది మంచితనం. ఆయన నుంచి నేను నేర్చుకున్నవి ఇవే. నేనే కాదు.. ఆయనతో పరిచయం ఉన్న వారెవ్వరైనా అదే మాట చెబుతారు అని సమాధానం ఇచ్చాడు. 

కాగా పవన్‌ బర్త్‌డేలను జరుపుకోడు. కానీ 'కాటమరాయుడు' షూటింగ్‌ స్పాట్‌లో శివబాలాజీ బర్త్‌డే అని తెలుసుకుని కేక్‌ని తెప్పించి తానే ఆ బర్త్‌డేని సెలబ్రేట్‌ చేశాడు. ఆ సందర్భంగా శివబాలాజీ ఆయనకు ఓ కత్తిని కూడా బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి శివబాలాజీ కూడా నితిన్‌, అలీ, సప్తగిరి రూట్‌లోనే వెళ్తున్నాడు. ఆయన బిగ్‌బాస్‌ విన్నర్‌గా మంచి క్రేజ్‌ని తెచ్చుకున్నాడు. దాంతో తానే స్వయంగా రాజీవ్‌కనకాలతో కలిసి 'స్నేహమేరా జీవితం' చిత్రం చేశాడు. బిగ్‌బాస్‌లో ఈయన టాపే గానీ సినిమా విషయంలో మాత్రం ఇంకా ర్యాంక్ కొట్టలేకపోతున్నాడు. 

Siva Balaji About Power Star Pawan Kalyan:

Bigg Boss Winner Siva Balaji Praises Pawan Kalyan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ