'బాహుబలి' తరువాత భారీ గ్యాప్ తో వస్తున్న అనుష్క 'భాగమతి' సినిమాపై భారీ అంచనాలున్నాయి. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. బాహుబలి చేస్తున్న టైం లోనే అనుష్క భాగమతికి కమిట్ అవడమే కాదు.. కొంతమేర షూటింగ్ లో కూడా పాల్గొంది. ఇక ఈ సినిమాని అనుష్క ఫ్రెండ్ ప్రభాస్ కి అత్యంత సన్నిహితులు అయిన వంశీ, ప్రమోద్ యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. షూటింగ్ పనులు అన్నీ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న 'భాగమతి' రిలీజ్ కి ముందే రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది.
అనుష్క కున్న ఫాలోయింగ్ కారణంగా ఈ సినిమాపై ఎంత అంచనాలున్నాయో వేరేగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం అనుష్క నటిస్తున్న 'భాగమతి' తమిళ్ రైట్స్ ని స్టూడియో గ్రీన్ వారు 15 కోట్లకి కొనుగోలు చేశారట. మరి 'బాహుబలి'తోనే ఇండియా వైడ్ గా అభిమానులని సంపాదించుకున్న అనుష్కకి తమిళంలోనూ మంచి క్రేజ్ ఉంది. అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో అనుష్క టాప్ హీరోయిన్ గా వెలిగింది. అందుకే 'భాగమతి'ని ఈ రేంజ్ లో ప్రైస్ పెట్టి కొనడానికి కారణమయ్యింది.
మరోపక్క అనుష్క 'భాగమతి' తమిళంలో ఇంత రేటు రావడానికి 'బాహుబలి' మూవీయే కారణం అంటున్నారు. అవును 'బాహుబలి' తరువాత అనుష్క మార్కెట్ పెరిగింది. అందుకే ఈ రేంజ్ లో డబ్బులు పెట్టి ఈ సినిమాని వారు కొనుగోలు చేశారట. ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అంచనాల్ని పెంచేసింది. ఇక ఈ సినిమా జనవరి 26 న రిపబ్లిక్ డే నాడు విడుదలవుతుంది.