ఏయన్నార్, నాగచైతన్య, అఖిల్‌లు కలిసి 'మనం' వంటి అక్కినేని ఫ్యామిలీ చిత్రం చేశారు. దానికి దర్శకుడు విక్రమ్ కె.కుమారే. ఇక ఆ చిత్రంలో నేటి అక్కినేని ఇంటికోడలు సమంత కూడా యాదృచ్చికంగా నటించింది. ఇప్పుడు అదే ఫీట్‌ని మరలా విక్రమ్ కె కుమార్ చేయనున్నాడట. అక్కినేని నాగార్జున చిన్నతనయుడు అఖిల్ హీరోగా నటించిన మొదటి చిత్రం 'అఖిల్'లో కూడా నాగ్ కనిపించాడు. ఈసారి అక్కినేని అఖిల్ రెండో చిత్రంగా, ఆయనకు రీలాంచ్ ఫిల్మ్‌గా రూపొందుతోన్న 'హలో' చిత్రంలో కూడా నాగార్జునతోపాటు అక్కినేని కుటుంబ కోడళ్లయిన అమల, సమంత, నాగార్జునలు కూడా ఈ చిత్రంలో కాసేపు మెరిసి అక్కినేని అఖిల్‌కి 'హలో' చెప్పనున్నారు.
ఈ చిత్రంలో అఖిల్ పాత్ర పేరు అవినాష్. సో వారు 'హలో అఖిల్' అని చెప్పకుండా 'హలో అవినాష్' అంటూ వెండితెరపై కనిపించనున్నారు. మొదట్లో 'మనం' చిత్రంలో నాగార్జున అఖిల్ కనిపించడని చెప్పినా, అందులో అఖిల్ చివరి సీన్‌లో మెరిశాడు. ఇక ఇందులో కూడా అలాగే నాగచైతన్య కూడా కనిపించే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టైటిల్ పోస్టర్ నుంచి టీజర్ వరకు అన్ని బాగా స్పందనను రాబట్టాయి.
ఇందులో అఖిల్ యాక్షన్ సీన్స్‌తో పాటు మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, ఆయన మాజీ భార్య, తెలుగులో ఒకప్పటి హీరోయిన్ అయిన లిజి దంపతులకు పుట్టిన కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఎంతగానో అలరించింది. త్వరలో ఈ చిత్రం థియేటికల్ ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.