అజిత్ ఎవరినైనా నమ్మితే మన పవన్‌కల్యాన్‌లానే ఇక వదిలిపెట్టడు. ఇక కెమెరామెన్ కం డైరెక్టర్ శివతో అజిత్ ఇప్పటికే మూడు చిత్రాలు చేశాడు. ఇవేమీ గొప్ప కథలేమీ కాదు. కేవలం అజిత్‌కి ఉన్న క్రేజ్ మీదనే ఈ చిత్రాలు కలెక్షన్లను కొల్లగొట్టాయి. 'వీరం, వేదాళం, వివేగం' వంటీ మూడు చిత్రాలు అవే కోవకి వస్తాయి. ఇవి అభిమానులను అలరించాయే గానీ సామాన్య ప్రేక్షకులను సంతృప్తి కలిగించలేకపోయాయి. ఇక 'వివేగం' విషయంలో మరీ దారుణం. కేవలం ఓపెనింగ్స్‌ని తప్ప ఈ చిత్రం ఫుల్‌రన్‌లో తన సత్తా చాటలేకపోయింది. కానీ అజిత్ మాత్రం మరోసారి దర్శకుడు శివకే అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రాన్ని కూడా సత్యజ్యోతి ఫిలింస్ నిర్మిస్తుండగా, తమకు కలసి వచ్చిన 'వ' సెంటిమెంట్‌నే రిపీట్ చేస్తూ 'విశ్వాసం'గా టైటిల్‌ని నిర్ణయించారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఇప్పటికే తమన్నా,కాజల్, సమంతలు అయిపోవడంతో ఇప్పుడు 'విశ్వాసం'లో హీరోయిన్‌గాఎవరిని తీసుకుంటారు? అనే ఆసక్తి నెలకొంది.
మొదట అనుష్క పేరు వినిపించింది. కానీ ఈ చిత్రంలో ఆమె నటించడం లేదు. దీంతో రెండు మూడు చిత్రాలకే తమిళంలోమంచి క్రేజ్ సంపాదించి, ఏకంగా గుడి కట్టించుకున్న హీరోయిన్‌గా, తమిళ తంబీలకు ఇష్టమైన బబ్లీ లుక్‌తో కనిపించే కీర్తిసురేష్‌ని ఇందులో హీరోయిన్‌గా ఎంపిక చేయనున్నారని సమాచారం. ఇది కుటుంబ కథా చిత్రం కావడం,.. కీర్తికి అలాంటి పాత్రలు సరిగ్గా సూట్ అవుతాయి కాబట్టి బహుశా ఆమెనే ఖరారు చేయడం గ్యారంటీ అని చెప్పవచ్చు. దీని వల్ల తమిళంలోనే గాక తెలుగు, మలయాళంలో కూడా ఈ చిత్రానికి క్రేజ్ వస్తుంది. ప్రస్తుతం కీర్తి తెలుగులో పవన్ చిత్రం, తెలుగు, తమిళం, మలయాళంలో రూపొందుతున్న త్రిబాషా చిత్రమైన 'మహానటి'లలో నటిస్తోంది. తమిళంలో సూర్యతో తానా సేంద కూట్టం, విక్రమ్ సామి2, విశాల్ నటిస్తున్న 'సండకోళి2'లలో బిజీగా ఉంది.