మలయాళ నటి కిడ్నాప్, అత్యాచార ప్రయత్నం తర్వాత మన దేశంలోని సినీ నటీమణులు తమకు కూడా జరిగిన చేదు అనుభవాలు, లైంగిక వేధింపులపై గళం విప్పుతున్నారు. క్యాస్టింట్‌కౌచ్ విషయంలో 'మీ టూ' అంటూ జాయిన్ అయి తమ గళం వినిపిస్తున్నారు. మరోవైపు కొందరు బిజెపి ప్రజాప్రతినిధులు సినిమాలలోని నటీమణులు మంచంపై పరుపును మార్చినట్లు మగాళ్లని మారుస్తారని మీడియా ముఖంగా చెబుతున్నారు. ఇక హాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత అయిన హార్వే వెయిన్‌స్టన్ 20ఏళ్లపాటు హాలీవుడ్‌తో పాటు విదేశీ హీరోయిన్లు, చివరకు ఐశ్వర్యారాయ్, ప్రియాంకచోప్రా వంటివారిపై కూడా కన్నేసిన వ్యవహారాలు ఇప్పుడు బయటికి వస్తుండటంతో ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్‌అవార్డు గ్రహీత జెన్నిఫర్‌లారెన్స్ కూడా తనకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది.
ఓ చిత్రంలో అవకాశం కోసం వెళ్లితే, రెండు వారాలలో 15 పౌండ్ల బరువు తగ్గమన్నారు. నాతో పాటు మరో నలుగురిని నగ్నంగా నిలబెట్టి, అందులో ఓ అమ్మాయి బరువు తగ్గలేదని పంపించేశారు. మిగిలిన మమ్మల్ని నగ్నంగా ఫోటోలు తీయడంతో పాటు నీకు నువ్వే న్యూడ్‌గా ఫొటోలు తీసుకుంటే వాటిని చూసి నువ్వు ఇన్‌స్పైర్ అవుతావు అన్నారట. ఇంకో ఫిల్మ్‌మేకర్ నువ్వు కాస్త బరువు ఎక్కువ ఉన్నావు. అయినా పడకలోకి బాగా ఉంటావు అని వ్యాఖ్యానించాడట. దీనిపై ఆమె మాట్లాడుతూ.. 'కలల ప్రపంచంలో అందరికీ సమానమైన గౌరవం దక్కాలి. అప్పటి వరకు ప్రతి అబ్బాయికి, అమ్మాయికి, మహిళకు, పురుషునికి నా గళం వినిపిస్తాను' అని చెప్పుకొచ్చింది.
ఇక హాలీవుడ్ హీరోయిన్లే కాదు. అక్కడి మహిళలు విచ్చలవిడిగా సెక్స్ చేస్తారని, ప్రతి మగాడితో సుఖం పంచుకుంటారని, నగ్నంగా, బికినీలలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయరనే దురభిప్రాయం ఉంది. ఇక సన్నిలియోన్ వంటి పోర్న్ స్టార్స్‌ని కూడా అదే దృష్టితో చూస్తారు. అయితే మహిళలు ఇష్టపడి సెక్స్ చేస్తే అందులో అభ్యంతరాలు ఉండవు గానీ ఎవరైనా సరే బలవంతంగా సెక్స్ చేసినా, చివరకు భార్యకు ఇష్టం లేకుండా భర్త బలవంతంగా చేసినా అది అత్యాచారం కిందకే వస్తుందని కోర్టులు కూడా చెబుతున్నాయి!