ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా '2.0'. సూపర్ స్టార్ రజినీకాంత్ - శంకర్ కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అసలయితే ముందుగా మేకర్స్ చెప్పినట్లుగా '2.0' సినిమా మరో రెండు నెలల్లో అంటే జనవరిలో విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు '2.0' విడుదల వాయిదా పడిందనే ప్రచారం జరిగినా.. '2.0' మేకర్స్ ఎక్కడా క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇకపోతే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది.
450 కోట్ల భారీ బడ్జెట్ పెట్టిన ఈ '2.0' కి అదే స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్, ఇతర భాషా హక్కులు, శాటిలైట్స్ హక్కులు, డిజిటల్ హక్కులు ఇలా మొత్తం కలిపితే అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతుందనే టాక్ ఉంది. అసలు ముందుగా '2.0' బడ్జెట్ చూసిన వారంతా.. మళ్ళీ అంత మొత్తం పెట్టుబడి వెనక్కి వస్తుందా అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రి రిలీజ్ బిజినెస్ చూశాక గాని అర్ధమవలేదు. ఇప్పటికే '2.0' తెలుగు హక్కులను 80 కోట్లకు విక్రయించిన లైకా ప్రొడక్షన్స్ వారు.. శాటిలైట్స్ హక్కులను భారీగానే అమ్మకానికి పెట్టారంటున్నారు.
అసలు '2.0' చిత్రం నాన్ థియేట్రికల్ హక్కులతోనే 100 కోట్ల దాకా రాబట్టే అవకాశముందని అంటున్నారు. మరోపక్క '2.0' డిజిటల్ హక్కులు కూడా భారీ ధరకు విక్రయించినట్లుగా తెలుస్తుంది. ఈ మధ్య డిజిటల్ హక్కుల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ చిత్ర డిజిటల్ హక్కులను 25 కోట్లు చెల్లించిందనే టాక్ వినబడమే కాదు.. సొంతం చేసుకుందట. మరి అమెజాన్ ప్రైమ్ సంస్థ 25 కోట్లకు డిజిటల్ హక్కులు కొనేసినట్లుగా చిత్ర బృందం కూడా ధ్రువీకరించింది. మరి డిజిటల్ హక్కులే ఇలా ఉంటే.. ఇక మిగతా బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహకే అందడం లేదు కదా!