Advertisementt

చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సస్పెన్స్ వీడింది!

Tue 28th Nov 2017 12:58 PM
sai dharam tej,ram charan,ntr,ss rajamouli,secret,movie  చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సస్పెన్స్ వీడింది!
Sai Dharam Tej Clarity on NTR And Ram Charan Multistarrer Film చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సస్పెన్స్ వీడింది!
Advertisement
Ads by CJ

రాజమౌళి తాను తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, మగధీర హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ని తనకి ఇరువైపులా కూర్చోబెట్టుకుని తీయించుకున్న ఫోటో ఫిలిం ఇండస్ట్రీనే కాదు యావత్ భారత్ లో ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ ఫోటోతో చరణ్, ఎన్టీఆర్ లను పెట్టి రాజమౌళి ఒక మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తున్నట్లుగా జనాలు ఊహించుకోవడమే కాదు మెంటల్ గా ఫిక్స్ అయ్యారు కూడా. మరోవైపు ఒకరి నిర్మాణంలో మరొకరు హీరో అనే ప్రచారము జరిగింది. కానీ అటు రాజమౌళి గాని ఇటు ఎన్టీఆర్, చరణ్ లు గాని ఈ ఫోటో మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

కానీ ఇపుడు మెగా హీరో ఒకరు ఈ ఫోటో ద్వారా వారి మల్టీస్టారర్ ఉంటుందని కన్ఫర్మ్ చేసేశాడు. అతనెవరో కాదు మెగాస్టార్ మేనల్లుడు, జవాన్ హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ జవాన్ ఇంటర్వూస్ లో భాగంగా ఒక ప్రముఖ ఛానల్ అడిగిన ప్రశ్నకు.. కాదు కాదు రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ఫోటో చూపిస్తూ అడిగిన ప్రశ్నకు సాయి ధరమ్ సమాధానం చెప్పేశాడు. అసలు ఆ ఫోటో ని రాజమౌళి తొమ్మిది గంటల ప్రాంతంలో ట్విట్టర్ లో పెట్టినప్పుడు.. తాను చూశానని.. అయితే చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కలిసి ఏదైనా డిన్నర్ లో కలిసారో.... లేదంటే ఏదైనా పార్టీలో తీయించుకున్న ఫోటోనో అని అనుకున్నానని చెప్పాడు.

అలా అనుకునే బయటికెళ్తుండగా.. నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ ఫోటో చూసావా అని అడిగితె.. హా చూసా.. ఏదో పార్టీలో తీయించుకున్న ఫోటో అని చెప్పగా.. కానీ మా ఫ్రెండ్ మాత్రం లేదురా.. అబ్బాయ్.. ప్రాజెక్ట్ అంట అని చెప్పగానే.. వెంటనే (చరణ్ అని సైలెంట్గా...) ఫోన్ చేశాను. నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఎందుకంటే గొప్ప దర్శకుడు, టాలీవుడ్ ఇద్దరు బిగ్ స్టార్ హీరోలు..... కలిసి సినిమా చేస్తున్నారు. నిజంగా ఎగ్జయిట్ అయ్యా. ఆ తర్వాత చాలా ఆనందించాను. అని మెగా మేనల్లుడు ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చి సస్పెన్స్ కి తెరదించాడు.

Sai Dharam Tej Clarity on NTR And Ram Charan Multistarrer Film:

Sai Dharam Tej Revealed Rajamouli Posted Photo Secret

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ