Advertisementt

శ్రీదేవి కూతురు ఎంట్రీ ఇంత విషాదాంతమా?

Mon 27th Nov 2017 11:52 PM
jhanvi kapoor,sridevi,daughter,new movie  శ్రీదేవి కూతురు ఎంట్రీ ఇంత విషాదాంతమా?
Sridevi's daughter Jhanvi Kapoor In SAIRAT Hindi Remake శ్రీదేవి కూతురు ఎంట్రీ ఇంత విషాదాంతమా?
Advertisement
Ads by CJ

ఎంతోకాలంగా ఎందరో ఎదురు చూస్తున్న అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె తెరంగేట్రం జరుగుతున్న విషయం తెలిసిందే. మరాఠిలో ఘనవిజయం సాధించిన 'సైరత్‌' చిత్రానికి ఇది బాలీవుడ్‌ రీమేక్‌గా రూపొందుతోంది. ఈ చిత్రం మరాఠీలో 4కోట్లతో నిర్మితమై 100కోట్లకు పైగా వసూలు చేసి మరాఠి చిత్రపరిశ్రమలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాదు.. పరిధి తక్కువగా ఉండే మరాఠీ చిత్రాల మార్కెట్‌ పరిధిని కూడా ఇది వ్యాపింపజేసింది. ఇక ఈ రీమేక్‌లో జాన్వికపూర్‌ సరసన ఇషాన్‌ఖత్తర్‌ నటిస్తున్నాడు. కరణ్‌జోహార్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌, జీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ కూడా తాజాగా విడుదలైంది. ఈమూవీకి 'ధడక్‌' అనే టైటిల్‌ని పెట్టిన సంగతి తెలిసిందే. 

ఇక ఈ చిత్ర దర్శకుడు శశాంక్‌ ఖైతాన్‌ ఇటీవల ఓ పత్రికతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. జాన్వికపూర్‌, ఇషన్‌ఖత్తర్‌లు చాలా గొప్పవారు. వారిలో కష్టపడే తత్వం చూసి నాకు ఎంతో ముచ్చటగా ఉంది. నాకు నటీనటులలో కావాల్సింది కష్టపడే తత్వమేనని చెప్పాడు. శ్రీదేవి ఎంతో కాలం ఎన్నో అవకాశాలను కాదని చివరికి ఈ చిత్రం ద్వారా తన కుమార్తెని తెరంగేట్రం చేయిస్తుండటంతో అంతటా దీనిపై ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ చిత్రం ఒరిజినల్‌ మరాఠిలో విషాదాంత ప్రేమకథగా రూపొందింది. మరి తన కుమార్తె చేసే మొదటి చిత్రమే విషాదాంతంగా ఉండేలా? చేయడానికి శ్రీదేవి ఒప్పుకుంటుందా? అనేది సందేహమే. 

కాబట్టి ఈ చిత్రాన్ని బహుశా సుఖాంతం చేసేలా కథతో మార్పులు, చేర్పులు ఉంటాయని అంటున్నారు. దర్శకుడు కూడా సినిమాని యధాతధంగా రీమేక్‌ చేయడం లేదని, కేవలం సినిమాలోని మెయిన్‌పాయింట్‌ని తీసుకుని సరికొత్త సీన్స్‌ రాసుకున్నామని చెబుతున్నాడు. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది జులై 6న విడుదల చేయాలని భావిస్తున్నారు. 

Sridevi's daughter Jhanvi Kapoor In SAIRAT Hindi Remake:

Fans Unhappy with Sridevi Daughter Entry Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ