Advertisementt

వర్మ శిష్యుడి మాటలు కూడా డిఫరెంటే!

Mon 27th Nov 2017 06:53 PM
actor jd chakravarthy,pawan kalyan,comments,social media  వర్మ శిష్యుడి మాటలు కూడా డిఫరెంటే!
JD Chakravarthy Sensational Comments on Pawan Kalyan వర్మ శిష్యుడి మాటలు కూడా డిఫరెంటే!
Advertisement
Ads by CJ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకి ఇద్దరు సన్నిహిత స్నేహితులు ఉన్నారు. వారిలో పూరీజగన్నాథ్‌ ఒకరు కాగా రెండో వ్యక్తి జెడిచక్రవర్తి అలియాస్‌ గడ్డం చక్రవర్తి. ఈయన కూడా అంతా వర్మ టైపే. తనకు శ్రీదేవి అంటే ఇష్టమని, జయసుధ అందం అంటే పిచ్చి.. అందుకోసమే 'మనీ' సినిమా చేశానని, శ్రీదేవితో ఎఫైర్‌ నడిపే ఛాన్స్‌ రాకపోయినా ఆమె కజిన్‌ మహేశ్వరితో గడపడం చాలా ఆనందాన్నిచ్చిందని చెబుతాడు. అంతేకాదు.. చిరంజీవి డ్యాన్స్‌లకు నేను పెద్ద అభిమానిని, అలాగని చిరంజీవి సినిమా చూసి డ్యాన్స్‌లు చిరంజీవి గారు ఏమి చేశారురా? అనను. నేను కూడా సాధారణ ప్రేక్షకుడిలా 'నా.. కొడుకు ఇరగదీశాడురా' అనే అంటాను అంటాడు. 

కాగా ఈయనకు శ్రీకాంత్‌కి చిరంజీవితో 'అన్నయ్య' చిత్రంలో నటించే అవకాశం వచ్చినా చేయలేదు. ఇక తాజాగా ఆయన పవన్‌పై స్పందించాడు. పవన్‌ చేసే సినిమాలను చూసి యువత ప్రభావితులవుతున్నారని తాను భావించడం లేదని, ఆయనకు ఆయన చేసే సినిమాల వల్ల ఓట్లు పడవు. ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసే సేవా కార్యక్రమాలు, సమాజసేవ మీద ఉన్న ఆయనకున్నకోరికను చూసి మాత్రమే ఓట్లు పడతాయని వాస్తవాన్ని వెల్లడించాడు. 

ఇక తాను రివ్యూలను పట్టించుకోనని, వాటి వల్ల సినిమాలు ఆడటం, ఆడకపోవడం ఉండవని తెలిపాడు. తనకు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలు లేవని స్పష్టం చేశాడు. మొత్తానికి జెడి పవన్‌ విషయంలో చెప్పిన మాటలు వాస్తవం. ఆయన వ్యక్తిత్వం, భావజాలం, కులాల వంటి వాటిపై ఆయన అభిప్రాయాలను చూసే నేడు ఎంతో మంది ఆయన అభిమానులు కాని వారు కూడా ఆయన రాజకీయాలలోకి వస్తే చూడాలని వెయిట్‌ చేస్తున్నది వాస్తవం...! 

JD Chakravarthy Sensational Comments on Pawan Kalyan:

Actor JD Chakravarthy Talks About Pawan Kalyan Social Service 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ