సినిమాలో గ్లామర్ షో ఉంటే జనాలు థియేటర్ కి వచ్చేస్తారు... హీరోయిన్ హాట్ అందాలతోనే సినిమా ఆడేస్తుంది... అనుకుని చాలామందే బొక్కబోర్లా పడ్డారు. ఇక హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలో కొన్నాళ్ళు నిలబడాలి అంటే ఎడా పెడా అందాలు ఆరబోసేసి ఇక్కడే హీరోయిన్ గా సెటిల్ అవుదామని కలలుగంటారు. అయితే తెలుగులో, తమిళంలో హీరోయిన్స్ ఛాన్స్ లు రాక ఐటమ్ సాంగ్స్ కి స్పెషలిస్ట్ గా మారిన రాయ్ లక్ష్మిగారు హాట్అందాలతో బాలీవుడ్ లోకి జూలీ 2 తో అడుగుపెట్టింది. మత్తెక్కించే ఫొటోస్, పోస్టర్స్ తో మతులు పోగొట్టిన రాయ్ లక్ష్మికి జూలీ 2 మతి పోగొట్టింది.
గతంలో వచ్చిన జూలీ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన జూలీ 2 సినిమా ఎన్నో అంచనాల మధ్యన నవంబర్ 24 శుక్రవారం విడుదలయ్యింది. సినిమా విడుదలయిన మొదటి షోకే నెగెటివ్ టాక్ తో ప్రేక్షకులను బెంబేలెత్తించింది. ఈ సినిమాలో ఏదో.. రాయ్ లక్ష్మి ఆరబోసిన అందాలు.. బోలెడు రొమాంటిక్ సీన్స్ ఉంటాయని వెళ్లిన ప్రేక్షకులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది జూలీ 2 . అసలు ట్రైలర్ లో చూపించిన విధంగా సినిమాలో లేదని.. ఏదో అనుకుంటే ఇంకేదో ఉందని ప్రేక్షకులు అసంతృప్తి వ్యకం చేస్తున్నారు. మొదటి షోకే రాయ్ లక్ష్మి సినిమాకి కేవలం ఒక రేటింగ్ ఇచ్చిన క్రిటిక్స్ ఆ సినిమాని ఆడుకున్నారు.
అంతేకాకుండా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కనీసం కోటి కూడా వసూలు చేయలేదనే టాక్ షాకిస్తుంది. ఇక సినిమా ముందు ఏవో హాట్ సీన్స్ లీకయినట్లు, నటి నగ్మా జీవితాన్ని జూలీ 2 లో చూపిస్తున్నట్టుగా గట్టిగానే ప్రచారం చేసింది రాయ్ లక్ష్మితో పాటు చిత్ర బృందం. అలాగే సినిమా విడుదలైన గంటలోనే జూలీ 2 పైరసీ బారినపడడం వంటి విషయాలు అందరిని విస్మయానికి గురిచేశాయి. మరి రాయ్ లక్ష్మి ఎంతగా హద్దు పొద్దు లేని అందాలు ఆరబోసినా ప్రయోజనం సూన్యం.