వరుసగా అక్కినేని హీరోలతో సినిమాలు చేసిన కళ్యాణ్ కృష్ణ వరుసగా రెండు హిట్స్ అందుకున్నప్పటికీ అతని నెక్స్ట్ సినిమా మీద ఇంకా సరైన క్లారిటీ లేదు. నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన, నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో హిట్స్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ మళ్ళీ నాగార్జునతో బంగార్రాజు సినిమాని తెరకెక్కించాలని అనుకున్నాడు. దీనికి నాగ్ నుండి మొదట్లో సపోర్ట్ ఉన్నప్పటికీ క్రమేపి నాగార్జున కళ్యాణ్ కృష్ణ ని పక్కనపెట్టేశారు.
దానితో కళ్యాణ్ కృష్ణ వెంకటేష్ హీరోగా సినిమా చేద్దామనుకుని వెంకీకి ఒక స్టోరీ లైన్ కూడా వినిపించాడు. అయితే వెంకీ కూడా కళ్యాణ్ కృష్ణతో సినిమా చేద్దామనుకున్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి దానిని పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం వెంకటేష్... తేజ దర్శకత్వంలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మల్టిస్టారర్ సినిమా చేయనున్నాడు. అంటే దాదాపుగా కళ్యాణ్ కృష్ణని వెంకీ కూడా పక్కన పెట్టేసినట్లే.
ఇకపోతే వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో ఈ మల్టిస్టారర్ చెయ్యబోతున్నాడు. వెంకీతో పాటు ఈ సినిమాలో సాయి ధరం తేజ్ నటిస్తాడని అన్నప్పటికీ ఆ విషయమై ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. ఇకపోతే ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ ఏ హీరోతో సినిమా చేస్తాడో అనే దానిమీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే వుంది.