రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్‌తో 'రంగస్థలం 1985' చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్‌లోనే షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. మరోవైపు చరణ్ నిర్మాతగా తనతండ్రి చిరుతో చేయబోయే 'సై...రా' ప్రీప్రొడక్షన్, నటీనటులు, సాంకేతిక నిపుణులు, సెట్స్.. వీటిల్లో బిజీగా ఉన్నాడు. వాస్తవానికి చరణ్ సుకుమార్ చిత్రం తర్వాత కొరటాల శివతో చిత్రం చేయాలి. ఈ కాంబో అప్పుడు ప్రారంభోత్సవం కూడా జరుపుకుని ఆగిపోయింది. కానీ కొరటాల 'భరత్ అనే నేను'తో మూడు నాలుగు నెలలు బిజీ. ఆ తర్వాత చరణ్ మూవీ కథపై కూర్చుంటే మరో మూడు నెలలు గ్యాప్ వస్తుంది. సో.. అంతలోపే రామ్‌చరణ్ బోయపాటి శ్రీనుతో చేసే 'డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్.ఎల్.పి. ప్రొడక్షన్ 4గా చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు'. దీంతో చరణ్‌తో కొరటాల చేసే చిత్రం ఇప్పుడు కాదని క్లారిటీ వచ్చింది.
వాస్తవానికి కొరటాల చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త భాగస్వామ్యంలో చేయాల్సివుంది. దీంతో కొరటాల చరణ్‌ని వదిలేసి బన్నీతో చిత్రానికి సిద్దమవుతున్నాడు. 'నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా' తర్వాత బన్నీ తమిళ దర్శకుడు లింగుస్వామితో చేయాలని భావించాడు. కానీ దానిని పక్కనపెట్టి కొరటాలతో ముందుకు వెళ్లనున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ త్వరలో త్రివిక్రమ్ చిత్రం ప్రారంభించనున్నాడు. ఆ తదుపరి చిత్రాన్ని ఆయన 'జనతాగ్యారేజ్' కాంబినేషన్‌లోనే కొరటాలతో చేయాల్సి వుంది. కానీ మద్యలో జక్కన్న వచ్చాడు.
దీంతో రామ్‌చరణ్ బోయపాటి చిత్రం తర్వాత, ఎన్టీఆర్ త్రివిక్రమ్ చిత్రం తదుపరి.. ఇద్దరు రాజమౌళికే అంకితమవ్వాల్సి వుంది. సాధారణంగా జక్కన్న తన చిత్రం జరుగుతుంటే హీరోలు కేవలం తన చిత్రం పూర్తయ్యే వరకు ఇతర చిత్రాలలో నటించేందుకు ఇష్టపడడు. సో.. దీని వల్ల చరణ్, ఎన్టీఆర్, బోయపాటి, లింగుస్వామి, బన్నీ కొరటాల.. ఇలా అందరి ముందస్తు ప్లానింగ్‌లు తారుమారయ్యాయి.