Advertisementt

రామ్ చరణ్ తో మూడోస్సారి..!!

Sun 26th Nov 2017 06:54 PM
rakul preet singh,ram charan,boyapati sreenu,rakul,third time  రామ్ చరణ్ తో మూడోస్సారి..!!
Rakul Preet Singh In Boyapati and Charan Film రామ్ చరణ్ తో మూడోస్సారి..!!
Advertisement
Ads by CJ

బోయపాటి - రామ్ చరణ్ సినిమా ఆఫీషీయల్ గా మొదలయింది. బోయపాటి దర్శకత్వంలో మొదటిసారి ఒక మాస్ మసాలా చిత్రంలో నటిస్తున్నాడు రామ్ చరణ్. రంగస్థలం  షూటింగ్ కంప్లీట్ కాగానే  బోయపాటి మూవీకి షిఫ్ట్ అవుతాడట చరణ్. అయితే బోయపాటి - చరణ్ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ తో బోయపాటి తెరకెక్కించిన 'సరైనోడు'  సినిమా మాదిరిగా చెర్రీ సినిమా కూడా యాక్షన్ ఎంటెర్టైనర్ గా ఉండబోతుందట.

ఇక బోయపాటి ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తో పాటే... నటీనటుల ఎంపిక చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఇకపోతే బోయపాటి - రామ్ చరణ్ సినిమాలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ ని పక్కనపడేసి ఎవరైనా ఒక కొత్త హీరోయిన్ ని తేవాలని బోయపాటి భావిస్తున్నాడట. అయితే కొత్త హీరోయిన్ ని తీసుకుంటే... బడ్జెట్ కూడా తక్కువ అవుతుందని అని కూడా భావిస్తున్నారట. కానీ మెగా ఫ్యామిలీ మాత్రం.. రామ్ చరణ్ తో కలిసి బ్రుస్ లీ, ధ్రువ లో నటించిన రకుల్ ప్రీత్ అయితే బావుంటుందని అంటున్నారట. మరి ప్రస్తుతానికి హీరోయిన్ కోసం వేటలో ఉన్న ఈ సినిమా చిత్ర బృందం ఇందులో నటించే విలన్ సెర్చింగ్ లో కూడా ఉన్నారట.

మరి రకుల్ - చరణ్ జోడి గనక ఈ సినిమాలో నటిస్తే ముచ్చటగా మూడోసారి జట్టు కడుతున్నట్టే. ఇకపోతే డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమా 2018 జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలయ్యే అవకాశముంది. ప్రస్తుతం చెర్రీ నటిస్తున్న ‘రంగస్థలం’ 2018 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rakul Preet Singh In Boyapati and Charan Film:

Rakul Preet Singh Got Third Time Chance with Ram Charan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ