Advertisementt

అచ్చం మహేష్ లానే ఉన్న మేనకోడలు!

Sun 26th Nov 2017 07:48 AM
mahesh babu,sundeep kishan,manjula,jhanvi  అచ్చం మహేష్ లానే ఉన్న మేనకోడలు!
Mahesh Babu niece his carbon copy అచ్చం మహేష్ లానే ఉన్న మేనకోడలు!
Advertisement
Ads by CJ

తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. సౌత్‌, ఇండియన్‌ సినీ హిస్టరీలో ఘట్టమనేని ఫ్యామిలీకి, సూపర్‌స్టార్‌ కృష్ణకి విపరీతమైన అభిమానులతో పాటు ఓ విశిష్ఠ స్థానం ఉంది. ఆయన పెద్ద కుమారుడు రమేష్‌బాబు తన తండ్రి ఆశలను వమ్ము చేశాడు. హీరోగా, నిర్మాతగా కూడా రాణించలేదు. కానీ ఆయన చిన్నకుమారుడు మాత్రం తండ్రి కలను నెరవేరుస్తూ తెలుగులో టాప్‌స్టార్‌గా, 100కోట్లకు పైగా మార్కెట్‌ని అతి తక్కువ సమయంలోనే సాధించాడు. ఇక కృష్ణ కుమార్తె మంజుల విషయానికి వస్తే ఇప్పటివారికి ఆమె అందం గురించి తెలియకపోవచ్చు గానీ నాటి పరిశ్రమవారికి, మీడియాకు ఆమె అందం, చలాకీతనం, టాలెంట్‌ బాగా తెలుసు. నాడు ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వంంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన 'టాప్‌హీరో' చిత్రంలో సౌందర్యకి ముందు మంజులనే హీరోయిన్‌గా తీసుకున్నారు. కొంచెం షూటింగ్‌ కూడా జరిగింది. కానీ కృష్ణ అభిమానులు తమ అభిమాన హీరో కుమార్తె, తమ సోదరి వంటి మంజుల సినిమాలలో గ్లామరస్‌గా, రొమాన్స్‌లు, డ్యాన్స్‌లు చేయడం అంగీకరించలేకపోయారు. అందునా బాలకృష్ణ సరసన నటిస్తోందనే వార్తలు అసలు జీర్ణించుకోలేకపోయారు. దాంతో అభిమానుల ఒత్తిడికి కృష్ణ, మంజుల తలవంచారు. 

ఇక కమర్షియల్‌ నటిగా కాకుండా పెర్ఫార్మెన్స్‌ ఓరియంటెడ్‌గా 'షో, కావ్యాస్‌డైరీ,ఆరెంజ్‌' చిత్రాలలో నటించింది. ఈమధ్యే ఆమె నాడు నాన్న అభిమానులే నా ప్రపంచం అనుకున్నాను. కానీ అది కాదని తెలుసుకునే సరికి ఆలస్యమైందని తెలిపింది. ఇక ఈమె నిర్మాతగా కూడా మంచి సక్సెస్‌నే సాధించి, తన అభిరుచిని చాటుకుంది. కాగా ఇంతకాలం పెర్ఫార్మెన్స్‌ ఓరియంటెడ్‌ నటిగా, నిర్మాతగా ప్రూవ్‌చేసుకున్న ఆమె తనలోని టాలెంట్‌ని బయటికి తెచ్చేందుకు దర్శకురాలి అవతారం ఎత్తింది. ప్రస్తుతం ఆమె సందీప్‌కిషన్‌, అమైరా దస్తూర్‌లతో ఓ రొమాంటిక్‌ మూవీని తెరకెక్కిస్తోంది. టైటిల్‌ ఇంకా నిర్ణయించని ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్‌, ఇందిరా ప్రొడక్షన్స్‌లు నిర్మిస్తున్నాయి. ఇక తాను హీరోయిన్‌గా చేయలేకపోయినా తన కూతురు జాన్విని మాత్రం ఆమె హీరోయిన్‌ని చేయాలనే ఉద్దేశ్యంలో ఉంది. సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు తాము చేయలేకపోయిన పనిని తమ బిడ్డలు చేయాలని భావిస్తారు. అదే కోవకి మంజుల కూడా వచ్చి చేరింది. 

సందీప్‌కిషన్‌ చిత్రంలో జాన్వి చేత ఓ కీలకపాత్ర చేయిస్తుండటం దాదాపు ఖరారు అయిపోయింది. ఈ చిత్రం షూటింగ్‌ స్పాట్‌లో జాన్వి, సందీప్‌కిషన్‌ల ఫొటోని మంజుల ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఇంకా ఆమె ట్వీట్‌ చేస్తూ 'మా అమ్మాయిని ఎప్పుడు షూటింగ్‌ స్పాట్‌లకి రానివ్వలేదు. తొలిసారిగా వచ్చింది. దాంతో నేను కాస్త నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ ఆమే ఎంతో సులభంగా, ఆత్మవిశ్వాసంతో నటించింది. మంచిఅందగత్తె, సహజంగా నటించింది. నా కూతురిని చూస్తుంటే చిన్ననాడు బాలనటునిగా సోదరుడు మహేష్‌బాబుని చూసినట్లుంది' అని తెలిపింది. సో.. జాన్వి త్వరలో హీరోయిన్‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే మహేష్‌ మేనకోడలు కూడా హీరోయిన్‌ కానుంది. మరి మహేష్‌ కూడా తన కుమారుడు గౌతమ్‌కృష్ణని హీరోని చేయడమే కాదు.. ఆడమగ తేడా లేకుండా తన కూతురు సితారని కూడా హీరోయిన్‌ని చేస్తాడో లేదో చూడాల్సివుంది..! 

Mahesh Babu niece his carbon copy:

Super Star Krishna’s stardom is inherited fantastically by son Mahesh Babu who is now an uncrowned Super Star.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ