Advertisementt

నాగ్, అనుష్క మధ్య అది లేదంట!

Sat 25th Nov 2017 08:43 PM
nagarjuna,ram gopal varma,songs,romance,anushka  నాగ్, అనుష్క మధ్య అది లేదంట!
No Romance Between Anushka and Nag in Varma Film నాగ్, అనుష్క మధ్య అది లేదంట!
Advertisement
Ads by CJ

నాగార్జున - రామ్ గోపాల్ వర్మ కలయికలో ఒక యాక్షన్ సినిమా తెరకెక్కుతుంది. నిన్నగాక మొన్న షూటింగ్ మొదలెట్టిన ఈ సినిమా రెగ్యులర్ గా 10 రోజులపాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకోనున్న విషయం తెలిసిందే. మద్యలో నాగ్ కి తన రెండో కొడుకు అఖిల్ 'హలో' సినిమా విడుదల ఉండడంతో. ఒక 20 రోజుల గ్యాప్ తో మరలా వర్మ సినిమా షూటింగ్ కి షిఫ్ట్ అవుతాడు నాగ్. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో నాగ్ సరసన హీరోయిన్ గా అనుష్క నటిస్తుందని టాక్ ఉంది. మరి వర్మ సినిమా అంటే కాసింత యాక్షన్ తోపాటు... కాసింత రొమాన్స్ కూడా ఉంటుంది.

అయితే ఇప్పుడు నాగ్ - వర్మ సినిమా మీద కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అదేమిటంటే వర్మ - నాగ్ సినిమాలో రొమాన్స్ కి అస్సలు చోటుండదట. అలాగే ఈ సినిమాలో అసలు పాటలే ఉండవట. ఒకవేళ ఉన్నా ఒకటి రెండు బ్యాగ్రౌండ్ పాటల మినహా ఇంక పాటలే ఉండవట. అసలు హీరోహీరోయిన్స్ మద్యన రొమాన్స్ అనే పదానికే చోటుండదట. మరి ఇక హీరోయిన్ ఉండి ఉపయోగం ఏమిటి అనుకుంటున్నారా. అయితే వర్మ - నాగ్ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఈ సినిమాలో నాగ్ పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్ పాత్రకి అంతే ప్రాధాన్యత ఉంటుందట.

అయితే  ఈసినిమాలో హీరోయిన్ పాత్రకు  ప్రేమించాలన్న ఆలోచనే ఉండదట. ఇకపోతే ఈ సినిమాలో నాగ్ కి సంబందించిన షూటింగ్ మొత్తం ముంబై పరిసర ప్రాంతాల్లో జరుగుతుందట. ఇక హీరోయిన్ షూటింగ్ మాత్రం జనవరిలో గాని, ఫిబ్రవరిలో గాని ఉంటుందట. అందుకే ఈలోపు డైరెక్టర్ వర్మ ఈ సినిమాలో నటీనటులకు కావాల్సిన కాస్టూమ్స్‌‌ సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడట. ఇకపోతే ప్రస్తుతం హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఒక 20 రోజుల పాటు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చేసి తర్వాత ముంబై కి పయనమవుతుందట.

No Romance Between Anushka and Nag in Varma Film:

No Songs in Nagarjuna and Ram Gopal Varma Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ