Advertisementt

నాని రికార్డ్స్ బయటపడుతున్నాయ్!

Sat 25th Nov 2017 05:03 PM
nani,mca,pre release business,hero nani,dil raju  నాని రికార్డ్స్ బయటపడుతున్నాయ్!
Nani MCA Shocking Business నాని రికార్డ్స్ బయటపడుతున్నాయ్!
Advertisement
Ads by CJ

ఒక హీరోకి ఒకటి రెండు హిట్స్ కే మార్కెట్ అమాంతం పెరిగిపోతుంది. ఆ హీరో నుండి సినిమా వస్తుంది అంటేనే ఆ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడిపోతాయి. అలాగే బిజినెస్ కూడా అదిరిపోయే లెవల్లో జరుగుతుంది. అదే వరుసగా ఏడు హిట్స్ అందుకుంటే.. ఆ పరిస్థితి ఇంకెలా ఉంటుందో మీరే ఊహించుకోండి. మరి ఆ పరిస్థితుల్లోనే నేచురల్ స్టార్ నాని ఉన్నాడు. హీరో నాని దాదాపుగా వరుసబెట్టి ఏడు హిట్స్ అందుకుని టాప్ పొజిషన్ లో... స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చే స్టేజ్ కి వచ్చేశాడు. ఈ ఏడాదే రెండు హిట్స్ తో ఉన్న నాని.. ఇప్పుడు MCA తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

నాని - సాయి పల్లవి కలయికలో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిడిల్ క్లాస్ అబ్బాయి మీద తారా స్థాయిలో అంచనాలున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో ఆకట్టుకున్న నాని ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ తో కళ్ళు బైర్లుకమ్మేలా చేస్తున్నాడు. మరి ఈ సినిమాపై ఉన్న అంచనాలతో ఈ సినిమా హక్కులు దక్కించుకోవడానికి డిస్ట్రిబ్యూటర్స్ క్యూకడుతున్నారు. ఈదెబ్బకి ఈ సినిమా నాని కెరీర్ లోనే రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. 25 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. మరోపక్క ఒక ప్రముఖ ఛానల్ MCA శాటిలైట్ హక్కులను దాదాపు 6 కోట్ల భారీ ధరకు కొనేసింది.

అంతేకాకుండా ఒక ఫ్యామస్ ఆన్లైన్ సంస్థ MCA డిజిటల్ హక్కులను ఏకంగా 5.5 కోట్లకు సొంతం చేసుకుందట. మరి అటు శాటిలైట్స్ హక్కులు, ఇటు థియేట్రికల్ హక్కులు, మరోపక్క డిజిటల్ హక్కులు.. ఇలా అన్ని నాని కెరీర్ లోనే హైయ్యెస్ట్. మరి ఇన్ని ఫిగర్స్ ని కలిపేస్తే.. ఓవరాల్ గా మొత్తం ఈ సినిమా 36  కోట్ల పైమేర బిజినెస్ చెసిందన్నమాట. మరి నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడి కంటే డబుల్ ప్రాఫిట్ వచ్చిందనే టాక్ నడుస్తుంది. ఇక నాని MCA చిత్రం డిసెంబర్ 21 న విడుదల కాబోతుంది.

Nani MCA Shocking Business:

Nani MCA Movie Pre Release Business Shocks 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ