పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్లాప్ టాక్ వస్తేనే కేవలం ఓపెనింగ్స్‌తో 60కోట్లకు పైగా వస్తాయని నిరూపించాయి. ఇక అదే బ్లాక్‌బస్టర్ అయితే ఇక కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించను కూడా ఊహించలేం. కాగా పవన్ నటిస్తున్న అతి ప్రతిష్టాత్మక చిత్రం, ఎలక్షన్ల ముందు ఆయన చేయబోయే చివరి చిత్రంగా 'అజ్ఞాతవాసి' పేరు వినిపిస్తోంది. ఇక ఇది పవన్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ కావడం, పవన్‌కి ఇది ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రం కావడం విశేషం.
రాజకీయాలలో బిజీ అయ్యే ముందు ఈ చిత్రంతో తన అభిమానులకు, ప్రేక్షకులకు కొన్నేళ్లు గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్ ఇవ్వాలని రెడీ అవుతున్నాడు. ఇక ఈ చిత్రానికి తమిళ సంచలన దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో ఆయనకి ఇదే మొదటి చిత్రం కావడం, ఇంత కాలం ఎక్కువగా దేవి శ్రీ ప్రసాద్‌తో సినిమాలు చేసిన త్రివిక్రమ్‌కి దేవి శ్రీ లేనిలోటు కనిపించకుండా చేసి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌ని ఇవ్వాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ కూడా 'అత్తారింటికి దారేది'లోలాగా 'కొడుకా..కోటేశ్వరరావా..' అనే పాటను పాడుతున్నాడని తెలియడంతో అంచనాలు మరింత పెరిగాయి.
ఇక పవన్ చిత్రాలలో కేవలం ఐటం సాంగ్స్‌కి ఇరికించడం ఉండదు. ప్రత్యేక సందర్భాలలో ఆయన ఐటం సాంగ్స్‌ని మించి స్పెషల్‌సాంగ్స్ వైపు మొగ్గుచూపుతుంటాడు. గతంలో 'అత్తారింటికి దారేది' చిత్రంలో కూడా ఇట్స్ టైం టు పార్టీనౌ' అనే పాటతో అదరగొట్టాడు. కాగా 'అజ్ఞాతవాసి'లో కూడా ఇలాంటి ఓ స్పెషల్ సాంగ్‌కి అద్భుతమైన ట్యూన్‌ని, దానికి అదిరిపోయే లిరిక్స్‌ని త్రివిక్రమ్ దగ్గరుండి మరీ శ్రద్దగా తయారు చేయించాడట.ఇక ఈ పాటను కూడా ఎంతో అద్భుతంగా తీయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ పాట ట్యూనే కాదు..లిరిక్స్ కూడా ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో ఈ పాట కూడా ఈ చిత్రానికి పవన్ పాడిన పాటతోపాటు మరో హైలైట్‌గా చెబుతున్నారు. ఇక ఇటీవల అక్కినేని కెరీర్, వ్యక్తిగత జీవితాలలోని ఆణిముత్యాల వంటి విషయాలను సేకరించి సంజయ్ కిషోర్ 'మన అక్కినేని' అనే పుస్తకాన్ని రాశారు. తాజాగా ఆయన 'అజ్ఞాతవాసి' సెట్‌కి వెళ్లి ఈ పుస్తకాన్ని పవన్, త్రివిక్రమ్‌లకు అందజేశాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ పుస్తకాన్ని పవనే ఆవిష్కరించాడని వార్తలు వచ్చాయి. వాటిని సంజయ్‌కి షోర్ ఖండించాడు. ఈ పుస్తకాన్ని గత నెలలోనే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేత ఆవిష్కరింపజేసినట్లు, ఈ పుస్తకాలను పవన్,త్రివిక్రమ్‌లకు స్పెషల్‌గా అందజేసినట్లు తెలిపాడు.