గతంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా టెంపర్. కమెడియన్ బండ్ల గణేష్ అప్పటికే నిర్మాతగా మరి సినిమాలు చేస్తూ ఎన్టీఆర్ - పూరి కలయికలో వచ్చిన టెంపర్ సినిమాని నిర్మించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా హిట్ అవ్వడమేకాదు.. అనేక అవార్డులను సొంతం చేసుకుంది. అయితే ఎప్పుడో వచ్చిన ఈ సినిమా ఇప్పుడుమరోమారు హైలెట్ అయ్యింది. టెంపర్ నిర్మాత బండ్ల గణేష్ కి ఎర్రమంజిల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటే 15 లక్షల జరిమానా కూడా విధించింది.
అసలు గణేష్ కి కోర్టు ఎందుకు జైలు శిక్షను విధించింది అంటే... టెంపర్ రైటర్ వక్కంతం వంశి కి గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో ఎర్రమంజిల్ కోర్టు ఈ శిక్షని బండ్ల గణేష్ విధించింది. టెంపర్ సినిమాకి కథని అందించిన వంశీకి ఇవ్వాల్సిన డబ్బుని చెక్ రూపంలో ఇవ్వడంతో.. ఆ చెక్ బౌన్స్ కేసులో గణేష్ ఇప్పుడిలా అడ్డంగా బుక్కయ్యాడు. చెక్ బౌన్స్ కేసులో గణేష్ ఇప్పుడు జైలుకెళ్లడమేకాదు.. భారీగా జరిమానా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ కేసు త్వరితగతిన విచారణకు వచ్చి నిర్మాత గణేష్ కి కోర్టు ఆరునెలల జైలు శిక్షతో పాటే... 15 లక్షల జరిమానా కూడా విధించింది.
మరోపక్క గణేష్ కూడా వంశి మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినట్లుగా తెలుస్తుంది. తనకు ఇచ్చిన టెంపర్ కథని.. వక్కంతం వంశి నవల రూపంలో వేరేవారికి అమ్మేసాడని బండ్ల గణేష్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. ఇంకా ఆ కేసు విచారణకు రావాల్సి ఉంది. అయితే తనకి కోర్టు శిక్ష విధించిన విషయమై స్పందించిన గణేష్ తాను పై కోర్టుకు వెళతానని చెప్పినట్టుగా తెలుస్తుంది.