'పద్మావతి' చిత్రం క్లాప్ కొట్టినప్పటి నుంచే వివాదం స్టార్ట్ అయింది. షూటింగ్‌లో సెట్స్ తగలబెట్టడంతో పాటు షూటింగ్‌స్పాట్‌లోని అందరినీ తుపాకీలతో బెదిరించి చావబాదారు కర్ణిసేన నాయకులు, కార్యకర్తలు. ఇక సినిమా పూర్తయి విడుదల తేదీ దగ్గరకు వచ్చే సరికి ఈ ఆందోళనమరలా ఎక్కువైంది. హిందు సంస్థలు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ చిత్రాన్ని తమ రాష్ట్రాలలో నిషేధించారు. దీనికి కారణం ఆయా రాష్ట్రాలలో రాజ్‌పుత్ ఓటు బ్యాంకు చాలా ఎక్కువగా ఉండటమే. ఇక 'మెర్శల్' చిత్రం విషయంలో బిజెపి నేతల తీరుని బాగాఎండగట్టినకాంగ్రెస్ కూడా రాజ్‌పుత్ ఓటు బ్యాంక్ కోసం 'పద్మావతి' విషయంలో నోరు మెదపడం లేదు. కాంగ్రెస్ పాలనలో ఉన్న పంజాబ్‌లో కూడా సినిమాని నిషేధించారు. ఈ విషయంలో కేవలం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రమే 'పద్మావతి' కి మద్దతునిచ్చింది.
ఇక తెలంగాణ, ఆంధ్రాలలో కూడా క్షత్రియ ఓటు బ్యాంకు చాలానే ఉంది. దాంతో ఈ రెండు ప్రభుత్వాలు వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. ఇక ఈ చిత్రం విషయంలో థియేటర్లను తగులబెడతామని, దీపికా, సంజయ్‌లీలాభన్సాలీల తలలు నరికితే 10కోట్లు ఇస్తామని హిందు సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఇక తాజాగా తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఈ చిత్రం ప్రదర్శిస్తే థియేటర్లు తగులబెడతామని వ్యాఖ్యానించాడు. దీనిపై జరిగిన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో రాజా సింగ్ పాల్గొని సినిమాలలోని మహిళలు మంచంపై పరుపును మార్చినట్లు మగాళ్లను మారుస్తారనే వ్యాఖ్యలకు మద్దతు ప్రకటించాడు. అంతేకాదు... సంజయ్ లీలా భన్సాలీ ఫ్యామిలీ గురించి మీకేమైనా తెలుసా? అని ప్రశ్నించాడు. దాంతో సినీ విమర్శకుడు కత్తి మహేష్ జోక్యం చేసుకుని, నిజమే భన్సాలీ ఫ్యామిలీ గురించి మాకు తెలియదు... నువ్వే చెప్పు అనడంతో రాజా సింగ్ మౌనం వహించాడు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ డీటైల్స్ తన వద్ద లేవని, తర్వాత చెబుతానని వ్యాఖ్యానించాడు. దాంతో కత్తి మహేష్ 'చరిత్రలో ఉందని చెబుతున్న ఓ మహిళను సపోర్ట్ చేయడం కోసం'...ఇప్పుడు ఆ చిత్రంలో నటిస్తున్న నటీమణులను, సినిమా పీల్డ్‌లోని మహిళలను అవమానిస్తున్నావని ఫైర్ అయ్యాడు.
ఇక తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, మరి సినిమాలోని మహిళలు పురుషులను మార్చే వారైతే, మరి బిజెపిలో ఉన్న నటీమణులు కూడా అంతేనా? చీ.. ఇలాంటి కుసంస్కారితో నేను మాట్లాడను. ఇలాంటివారు ప్రజాప్రతినిధులా? ఆయన స్థాయికి దిగి నా స్థాయిని తగ్గించుకోలేను అని వెళ్లిపోయాడు. ఇక భన్సాలీ చిత్రంకి ఇబ్బందులు ఉంటాయని ముందుగానే ఊహించి 150 కోట్లతో తీసిన ఈ చిత్రాన్ని140 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించాడట. ప్రభుత్వం సినిమాని నిషేధిస్తూ ఈ మొత్తం రాదు గానీ, సినిమా విడుదలై గొడవలు జరిగి ప్రదర్శనలు నిలిపి వేసినా, చిత్రం చూసేందుకు భయపడి ప్రేక్షకులు థియేటర్లకు రాకపోయినా ఆ మొత్తం వస్తుందట. మొత్తానికి భన్సాలీ ముందే జాగ్రత్త పడి, భవిష్యత్తును ఊహించి ఈ పని చేశాడనే చెప్పాలి...!