Advertisementt

హీరోలందరికీ.. లైన్‌వేస్తోందిగా!

Fri 24th Nov 2017 03:23 PM
  హీరోలందరికీ.. లైన్‌వేస్తోందిగా!
Mehreen Pirzada About Heroes హీరోలందరికీ.. లైన్‌వేస్తోందిగా!
Advertisement
Ads by CJ

నాటి తారలు నిజంగా అమాయకులు. వారు హీరోలకి ఎలా ఎర వేసి అవకాశాలు రాబట్టుకోవాలో, ఎలా మీడియాలో వార్తల్లో ఉండాలో అనే లౌక్యం లేకుండా పోయింది. దాంతో ఎవరితో అవకాశం వస్తే వారితో నటిస్తూ వచ్చారు. ఫలానా హీరోలు అని గిరిగీసుకోలేదు. సావిత్రినే చూసుకుంటే ఎన్టీఆర్‌తో హీరోయిన్‌గా నటించింది. చెల్లెలి పాత్రలో కూడా నటించింది. ఎంతో ఫామ్‌లో ఉండగానే కాంతారావు వంటి వారితో నటించి అగ్రహీరోల కోపానికి బలైపోయింది. ఇక జమునని తీసుకుంటే ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లతో పాటు 'మిస్సమ్మ' వంటి చిత్రాలలో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలతో పాటు హరనాథ్‌ వంటి వారి సరసన కూడా నటించింది. నాడు మీడియా ఇంత విస్తృతంగా లేకపోవడం కూడా దీనికి కారణం. 

కానీ నేటి నటీమణులకు ఏ వ్యాఖ్యలు చేయాలో. ఎవరిని బుట్టలో వేయాలో? ఎవరిని నొప్పించిక తానొవ్వక అన్నట్లు లబ్దిపొందాలో బాగా తెలుసు. ఎవరెవరితో నటించాలి? ఏ సమయంలో యంగ్‌ స్టార్స్‌తో నటించాలి. ఏ సమయంలో సీనియర్‌ స్టార్స్‌తో చేయాలి? ఫేడవుట్‌లో ఉన్నప్పుడు ఏం చేసి వెలుగులోకి రావాలి. యంగ్‌ హీరోలతో, కొత్తవారితో ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయకూడదు అనేవి వారికి బాగా తెలుసు. ఇప్పుడు అలాంటి లౌక్యం ఉన్న భామగా యంగ్‌ హీరోయిన్‌ మెహ్రీన్‌కౌర్‌ నిరూపించుకుంది. ఈమె నటించిన మొదటి మూడు చిత్రాలు మంచి హిట్‌ అయి హ్యాట్రిక్‌ హిట్స్‌గా నిలిచాయి. దాంతో యంగ్‌ హీరోలు, మీడియం హీరోలు ఆమె పట్ల ఆసక్తి చూపుతున్నారు. మీడియం బడ్జెట్‌ చిత్రాల నిర్మాతలు, దర్శకులు దృష్టి ఆమెపై పడింది. 

ఇక తాజాగా ఆమె మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో ఎవరితో నటించాలని ఉంది? అని ప్రశ్నిస్తే దానికి అందరి స్టార్స్‌ పేర్లు చెప్పేసింది. వాస్తవానికి నేను నటించాలని భావిస్తున్న హీరోల లిస్ట్‌ చాలా పెద్దది.. పవన్‌కళ్యాణ్‌... రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌.. మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ అంటూ నేటి స్టార్స్‌ అందరి పేర్లు చెప్పింది. బాలీవుడ్‌లో అవకాశం వస్తే వెళ్తారా? అని ప్రశ్నిస్తే..... దానికి కూడా ఎంతో లౌక్యంగా ప్రస్తుతం నేను తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నాను. నా దృష్టి అంతా తెలుగుపైనే ఉంది. నేను జీవితంలో ఏది ముందుగా ప్లాన్‌ చేసుకోను. వచ్చిన ఆఫర్స్‌ని బట్టి వెళ్తుంటానని చెప్పి తప్పించుకుంది. ఈ లెక్కన చూస్తే తనను ఎవరైనా సీనియర్‌ స్టార్స్‌ పెట్టుకోవాలని భావిస్తారో? దాని వల్ల యంగ్‌ స్టార్స్‌తో చాన్స్‌లు పోతాయనే ఉద్దేశ్యంతో సీనియర్‌ స్టార్స్‌కి ఇన్‌డైరెక్ట్‌గా నో చెప్పిందనే అనుకోవాలి...! 

Mehreen Pirzada About Heroes:

Mehreen Pirzada Love on Heroes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ