ప్రస్తుతం కొరటాల శివ, మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమాని తెరకెక్కిస్తూ బిజీగా వున్నాడు. మహేష్ తో సినిమా పూర్తి కాగానే కొరటాల శివ, రామ్ చరణ్ తో సినిమాకి కమిట్ అయ్యాడు. కానీ రామ్ చరణ్, కొరటాలను లైట్ తీసుకున్నాడని... అందుకే బోయపాటి దర్శకత్వంలో మూవీని మొదలెట్టబోతున్నాడన్నారు. మరోపక్క ఎన్టీఆర్ కూడా కొరటాలతో సినిమా చేయాలనుకున్నదని.. కాకపోతే త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యాక చేస్తాడనే ప్రచారం జరిగింది.
కానీ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ కూడా కొరటాలకు హ్యాండ్ ఇచ్చారని.. అందుకే కొరటాల అక్కినేని అఖిల్ తో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ నిన్న బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ తాజాగా కొరటాల.. మహేష్ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమాకి కమిట్ అయ్యే సూచనలు ఉన్నాయంటూ కథనాలు మొదలయ్యాయి.
అల్లు అర్జున్ కి కొరటాలకి మధ్యన కథ చర్చలు మొదలయ్యాయని... ఇక అల్లు అర్జున్, కొరటాల కాంబో గనక సెట్ అయితే ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లో ఉంటుందంటున్నారు. మరి అల్లు అర్జున్, కొరటాల సినిమాకి కమిట్ అయితే అటు విక్రమ్ కుమార్ తో పాటు, లింగుస్వామి సినిమాకి హ్యాండ్ ఇచ్చేసినట్టే అవుతుంది. మరి కొరటాలకి మహేష్ సినిమా తర్వాత ఏ హీరో సెట్ అవుతాడో గానీ ఇప్పుడు మాత్రం అనేకమంది హీరోలతో కొరటాలకు ముడి పెట్టి కథనాలు ప్రచారం చేస్తున్నారు.