ప్రస్తుతం తెలుగు నాటే కాదు దేశమంతా రాజమౌళి తదుపరి చిత్రంపైనే దృష్టి పెట్టి ఉంది. తాజాగా రాజమౌళి అటు ఇటు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి దిగిన ఫొటో పోస్ట్ చేయడంతో అందరిలో రాజమౌళి తదుపరి చిత్రం ఈ ఇద్దరు మెగా, నందమూరి స్టార్స్‌తో నిజమైన మల్టీస్టారర్ ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు. మరోపక్క ఇటు రాజమౌళితో, అటు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో కూడా కమిట్‌మెంట్స్ ఉన్న నిర్మాత డి.వి.వి. దానయ్య. సో ఈ చిత్రం దానయ్య నిర్మాణంలోనే రూపొందనుంది. ఇక ఒక్క స్టార్ హీరోయిజం, ఎమోషన్స్‌నే పీక్‌లో చూపించే రాజమౌళి, రచయిత విజయేంద్రప్రసాద్‌లు తూర్పు-పడమరగా ఫీలయ్యే నందమూరి, మెగా హీరోలను ఒకే చిత్రంలో పీక్స్‌లో చూపించడం కోసం స్పెషల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌లేని పూర్తి కమర్షియల్ హంగులతో కథను వండివార్చే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కూడా రెమ్యూనరేషన్స్ తీసుకోకుండా లాభాలలో వాటాని తీసుకుంటున్నారని సమాచారం. అంటే ఈ చిత్రం లాభాలలో వీరి ముగ్గురితో పాటు దానయ్యని కూడా కలిపితే మొత్తంగా సినిమాలో నాలుగు వాటాలు ఉంటాయి. బాలీవుడ్ స్టార్స్ ఇదే ఫార్ములాని ఫాలో అవుతారు.
మరోవైపు త్రివిక్రమ్ చిత్రంలో ఎన్టీఆర్, 'మగధీర'లో రామ్‌చరణ్‌లు కూడా ఇలాగే వాటాలు తీసుకున్నారట. మరోవైపు 'బాహుబలి' రెండు పార్ట్‌లకి కూడా జక్కన్న రెమ్యూనరేషన్ కాకుండా కేవలం లాభాలలో వాటానే తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విధానం వల్ల నిర్మాతకు మూడు పెద్ద మొత్తాల రెమ్యూనరేషన్ ప్రాబ్లమ్ తీరడమే కాదు.. సినిమా మేకింగ్ కోసం ఎక్కువ బడ్జెట్‌ను పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. మరో వైపు ఇది ఈ ముగ్గురికి కూడా లాభదాయకమే. ఎందుకంటే కన్‌ఫర్మ్ బ్లాక్‌బస్టర్స్ కొడతాడనే దర్శకుని చిత్రంలో నటించేందుకు రెమ్యూనరేషన్ కాకుండా లాభాలలో వాటా అయితేనే ఎక్కువ ఆర్ధికంగా లాభపడుతారు. మరో విషయం ఏమిటంటే.. ఈ చిత్రం కోసం దానయ్య ఈ ముగ్గురి రెమ్యూనరేషన్స్‌ని పక్కనపెట్టి ఏకంగా 150కోట్ల బడ్జెట్‌ని పెడుతున్నాడని తెలుస్తోంది. అలా అయితేనే లావిష్‌గా ముగ్గురి అంచనాలకు తగిన రీతిలో సినిమాని భారీగా నిర్మించడానికి వెసులుబాటవుతుంది.
ఇక ఈ రెండు ఫ్యామిలీల హీరోల మధ్య మంచి స్నేహం,, బంధం ఉన్నప్పటికీ వారి అభిమానులు మాత్రం ఉప్పులో నిప్పులా ఉంటారు. వారి మధ్య ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. మరి ఈ ఉప్పు నిప్పుని, తూర్పుపడమరలను కలిపే బాధ్యత జక్కన్న తీసుకుని, వీరందరిని ఒకటిగా చేసి పుణ్యం మూటగట్టుకోవాలని ఆశిద్దాం...!