మోహన్‌బాబు తన కెరీర్‌లో 'ఎమ్మెల్యే ఏడుకొండలు, అసెంబ్లీ రౌడీ, పొలిటికల్ రౌడీ, యం.ధర్మరాజు ఎం.ఏ' వంటి సంచలనమైన పొలిటికల్ బేస్‌డ్ చిత్రాలు చేశాడు. ఇక ప్రస్తుతం ఆయన మదన్ దర్శకత్వంలో మరో 'అసెంబ్లీ రౌడీ' లాంటి చిత్రంగా పొలిటికల్ సెటైరిక్ ఫిల్మ్‌గా 'గాయత్రి' చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మంచు విష్ణు కూడా ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు మంచు విష్ణు సోలో హీరోగా మరో పొలిటికల్ టచ్ ఉన్నమూవీ 'ఓటర్'ని చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'అడ్డా' దర్శకుడు కార్తీక్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ టైటిల్ పోస్టర్‌ని మంచు విష్ణు బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేశారు. సినిమా ఎలా ఉంటుందో తెలియదు గానీ ఈ పోస్టర్ మాత్రం అదిరింది. ఒకే సారి తెలుగు, తమిళ వెర్షన్స్‌లో ఈ చిత్రాన్ని తీస్తున్నారు.
దానికి తగ్గట్లుగా రెండు భాషలకి సంబంధించిన రాజకీయనాయకుల ఫొటోలను బ్యాగ్రౌండ్‌లో చూపిస్తూ, తాను ఓటేసిన తర్వాత తన కుడిచేతి చూపుడు వేలికి ఉన్న సిరా మరకను విష్ణు ఈ పోస్టర్‌లో చూపిస్తున్నాడు. ఇక తెలుగు వెర్షన్ పోస్టర్‌లో బ్యాగ్రౌండ్‌లో చిరంజీవి, బాలకృష్ణ, కేసీఆర్, కవిత, దాసరి, కృష్ణంరాజు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కృష్ణ, చంద్రబాబు నాయుడు, కేటీఆర్, లోకేష్ వంటి వారి ఫొటోలను పెట్టారు. తమిళంలో 'ఎంజీఆర్, స్టాలిన్, పెరియాళ్,జయలలిత, అన్భుమణి రాందాస్' వంటి వారి ఫొటోలను పెట్టారు. వీరంతా సినీ నటులుగా ఉండి రాజకీయాలలోకి వచ్చినవారు కొందరైతే, మరికొందరు కేవలం రాజకీయ నాయకులే. అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం అర్ధం కాని విషయం.
స్వయాన మంచు విష్ణు తండ్రి మోహన్‌బాబు కూడా ఒకనాడు రాజకీయనాయకునిగా రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. త్వరలో రాజకీయాలలోకి వస్తానంటున్నాడు. మరి తన తండ్రి ఫొటోని మాత్రం మంచు విష్ణు అండ్ టీం తమ తెలుగు పోస్టర్‌లో ఎందుకు పెట్టలేదో అర్ధం కాని విషయం... దీనిపై మంచు విష్ణునే స్పందించాలి. మొత్తానికి ఈ 'ఓటర్' అయినా మంచు విష్ణుకి మంచి హిట్‌ని అందిస్తుందో లేదో చూడాలి... ప్రస్తుతం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తన తండ్రితో పాటు పలువురు చిత్రాలు చేశారు.. చేస్తున్నారు. మరి వాటిలో ఇది కూడా ఓ మంచి చిత్రంగా ఓటర్లను ఆకట్టుకుంటుందా? లేదా..వెయిట్ అండ్ సీ..!