Advertisementt

రజినీ మరోసారి క్లారిటీ ఇచ్చాడు..!

Thu 23rd Nov 2017 09:57 PM
rajinikanth,kamal haasan,politics,2.0 movie  రజినీ మరోసారి క్లారిటీ ఇచ్చాడు..!
Superstar Rajinikanth in no hurry to enter politics రజినీ మరోసారి క్లారిటీ ఇచ్చాడు..!
Advertisement

తమిళంలో నాటి నుంచి నేటి వరకు నందమూరి-మెగా హీరోలలాగా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న హీరోలు ఇద్దరు. వారిద్దరు కెరీర్‌ మొదట్లో చాలా చిత్రాలలో కలిసి నటించారు. ఇక వీరు విడివిడిగా బాగా ఎస్టాబ్లిష్‌ అయిన తర్వాత వ్యక్తిగతంగా వీరిద్దరు మంచి స్నేహితులే అయినా అభిమానులు మాత్రం ఒకరిపై ఒకరు పోటీగా భావిస్తారు. వారే రజనీ, కమల్‌. ఇక విషయానికి వస్తే ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీ ఇటీవల అభిమానులతో సమావేశమయ్యాడు. దాంతో ఇక ఆయన రాజకీయ ఎంట్రీ ఖాయమని ఆయన ఫ్యాన్స్‌ కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఏ విధంగానూ స్పష్టత ఇవ్వడం లేదు. అభిమానులతో సమావేశాలు నిర్వహించాడు. మోదీ నుంచి ఎందరినో కలిశాడు. ఆయన సోదరుడు, సన్నిహిత మిత్రులు, ఆయన శ్రీమతి కూడా రజనీ ప్రజలలోకి వస్తున్నారని సంకేతాలు ఇచ్చారు. కానీ రజనీ మాత్రం 'దేవుడు శాసిస్తాడు.. నేను ఆచరిస్తాను' అనే మాట తప్ప ఏమీ చెప్పడం లేదు. 

తాజాగా రజనీకాంత్‌ తాను కొత్తగా ఏ రంగంలోకి కూడా రావడం లేదని చెప్పి షాక్‌ ఇచ్చాడు. దీంతో అభిమానుల ఉత్సాహమంతా నీరుగారి పోయింది. ప్రస్తుతం చేస్తున్న '2.0' చిత్రం వచ్చే ఏడాది విడుదల అవుతుందని, దానితో పాటు 'కాలా' చిత్రం చేస్తున్నానని, '2.0'  రిలీజ్‌ అయిన తర్వాత మరోసారి అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తానని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరో వైపు కమల్‌హాసన్‌ మాత్రం వేగంగా పావులు కదుపుతున్నాడు. సోషల్‌మీడియాలో ఇటీవల కమల్‌హాసన్‌ మీదకి ఓ బాలుడు కత్తిని పట్టుకుని చంపడానికి వస్తున్న ఫొటోపై స్పందిస్తూ.. కల్మషం లేని ఇలాంటి చిన్నారుల చేతిలో చనిపోవడానికి నేను సిద్దమేనంటూ తన సోషల్‌మీడియా ప్రొఫైల్‌ పిక్చర్‌ని తమిళ నాట విప్లవ మహాకవిగా పేరుతెచ్చుకున్న సుబ్రహ్మణ్యభారతి గెటప్‌లో ఉన్న చిత్రాన్ని పెట్టాడు. ఇక ఆయన గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. 

ఇక తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి 'మరలా జయలలిత పాలనను తెస్తాం' అంటున్నాడని, అంటే ప్రజలకు చెందిన 60కోట్ల డబ్బును కొల్లగొట్టడానికి రెడీగా ఉన్నారా? అంటూ జయపై ఉన్న 60కోట్ల అక్రమ సంపాదన కేసును ప్రస్తావించి సంచలనం సృష్టించాడు. ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేస్తారా? చేయండి... నేను నివాసం ఉండే ఇల్లు తేయాన్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది. నేనెక్కడికి పారిపోను.. పోలీసులను పంపి అరెస్ట్‌ చేయండి.. అంటూ ఈ వ్యాఖ్యలతో రాజకీయ నాయకునిగా మారి, సంచలనం సృష్టిస్తున్నాడు. ఈ విధంగా చూసుకుంటే గెలుపు ఓటములు ఎలా ఉన్నా.... ఎటూ తేల్చుకోలేని పిరికి వాడైన రజనీ కంటే కమలే డేరింగ్‌ అని చెప్పుకోవాలి...! 

Superstar Rajinikanth in no hurry to enter politics:

No need to enter into politics now: Rajinikanth

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement