Advertisementt

ఖాన్స్ కోసం రాసుకున్న కథే ఎన్టీఆర్, చరణ్ కి!

Thu 23rd Nov 2017 08:00 PM
ss rajamouli,jr ntr,ram charan,multistarrer film,vijayendra prasad,bollywood khans  ఖాన్స్ కోసం రాసుకున్న కథే ఎన్టీఆర్, చరణ్ కి!
Shocking News About Charan and NTR Multistarrer Film ఖాన్స్ కోసం రాసుకున్న కథే ఎన్టీఆర్, చరణ్ కి!
Advertisement
Ads by CJ

బాహుబలి తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తున్నాడో అనేది ఒకే ఒక పిక్ తో చెప్పకనే చెప్పేశాడు. ఏదో ప్రేమ కథ తీస్తాడని ఒకసారి.. కాదు కాదు చిన్న హీరోతో గ్రాఫిక్స్ లేని సినిమా చేస్తాడనే న్యూస్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ రామ్ చరణ్ - ఎన్టీఆర్ లతో కలిసున్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాహుబలి తర్వాత తన సినిమా ఏమిటనేది చిన్న హింట్ ఇచ్చాడు. కాకపోతే జనాలను కన్ఫ్యూజ్ కూడా బాగానే చేశాడు. ఎందుకంటే క్లారిటీ లేకుండా ఒక్క పిక్ తోనే సమాధానం చెప్పేశాను అనుకున్నాడు రాజమౌళి. కానీ జనాలు మాత్రం ఏవేవో ఊహించేసుకుని అనేక ఊహాగానాలు తెరపైకి తెచ్చేశారు.

ఇకపోతే రాజమౌళి.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ తో ఖచ్చితంగా సినిమా చెయ్యబోతున్నాడు. అది అలాంటి ఇలాంటి సినిమాకాదు. బాహుబలిని తలదన్నేరీతిలో సినిమా చెయ్యబోతున్నాడు. అలాగే ఈ సినిమాకి బడ్జెట్ కూడా 150  కోట్ల పైమాటే అన్నట్టుగా ప్రచారం మాత్రం గట్టిగానే జరుగుతుంది. అలాగే ఈసినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత సెట్స్ మీదకెళుతుందంటున్నారు. అలాగే రాజమౌళి తండ్రి ఆధ్వర్యంలో కథ కూడా రెడీ అవుతుందని.. రాజమౌళి  స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడంటున్నారు. అయితే విజయేంద్రప్రసాద్ ఈ స్టోరీని ఎన్టీఆర్ - రామ్ చరణ్ కోసం అనుకోలేదట. 

విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన భజరంగి భాయీజాన్ కి కథ అందించి.. ఆ సినిమాతో ఎనలేని కీర్తి ప్రతిష్టలు అందుకున్నాడు. అందుకే విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు కూడా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ - షారుఖ్ ఖాన్ లతో ఒక మల్టీస్టారర్ కోసం ఈ కథని తయారు చేసుకున్నాడట. ఇక ఈ మల్టీస్టారర్ లో నటించే స్టార్ హీరోలు అన్నదమ్ములుగా కనబడతారట. అయితే విజయేంద్ర ప్రసాద్ రాసుకున్న కథతో రాజమౌళి ని దర్శకుడిగా బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇప్పిద్దామని విజయేంద్ర ప్రసాద్ అనుకుంటే... రాజమౌళి మాత్రం మళ్లీ టాలీవుడ్ లో సత్తా చాటాలని డిసైడ్ అయ్యి బాలీవుడ్ ఖాన్స్ కోసం రాసిన ఈ మల్టీస్టారర్ కథని తెలుగులో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కోసం లాక్ చేశాడట. ఇక జక్కన్నతో సినిమా అంటే.. అటు చరణ్ ఇటు ఎన్టీఆర్ ఎప్పుడూ రెడీనే. అందుకే రాజమౌళి మల్టీస్టారర్ కి ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సోషల్ మీడియాలో బీభత్సమైన ప్రచారం జరుగుతుంది.

Shocking News About Charan and NTR Multistarrer Film:

Rajamouli Stopped Vijayendra Prasad Khans Story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ